JANASENA YOUTUBE: ఎన్నికలకు సరిగ్గా నెల కూడా లేని ఇలాంటి సమయంలో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరో హ్యాక్ చేశారు. జనసేన పార్టీ ఛానల్ ప్లేస్‌లో మైక్రో స్ట్రాటజీ అనే పేరు కనిపిస్తోంది. జనసేన పేరుతో యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా.. ఛానల్ కనిపించడంలేదు. ఇప్పటికే ఆ ఛానల్‌లో ఉన్న వీడియోలు డిలిట్ అయ్యాయి. దీంతో జనసైనికులు ఆందోళనకు గురవుతున్నారు.
CHANDRABABU NAIDU: మన రాజధాని అమరావతే.. మోదీ, పవన్‌తో కలిసి అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
ఈ పని ఎవరు చేయించారు అనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అప్పట్లో ఎన్నికల ప్రచారం అంటే ఖచ్చితంగా రోడ్డెక్కి ప్రచారం చేయాల్సిందే. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఆ పనిని సగానికి సగం తగ్గిస్తున్నాయి. ప్రతీ ప్రాంతానికి వెళ్లలేని నాయకులు తమ ఎజెండాను ప్రజలతో తాము చెప్పాలి అనుకుంటున్న విషయాలను సోషల్ మీడియా ద్వారానే చెప్తున్నారు. ప్రతీ రాజకీయ పార్టీ ఇందుకోసం సపరేట్‌గా డిజిటల్ టీంను కూడా పెట్టుకుంటోంది. తన ఎజెండాను, పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తోంది. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం. రాజకీయ ప్రత్యర్థుకు కౌంటర్లు ఇవ్వడం ఇవన్నీ సోషల్ మీడియాలోనే ఐపోతున్నాయి.
ప్రచారంలో డిజిటల్ మీడియా ఇంత క్రూషియల్ పాత్ర పోషిస్తున్న టైంలో జనసేన పార్టీ ఛానెల్ హ్యాక్ అవ్వడం ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం జనసేన టెక్నికల్ టీం.. ఈ పని ఎవరు చేశారు తెలుసుకునే పనిలో ఉన్నారు. యూట్యూబ్ టెక్నికల్ టీంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. తమ ఛానల్‌ను వెనక్కి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలే ఈ పని చేశారు అని జనసైనికుల నుంచి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది చేసింది ఎవరూ అన్న విషయం పక్కన పెడితే ఇలాంటి టైంలో ఛానల్ హ్యాక్ అవ్వడం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.