ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వం క్రమంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నారు. సీఎం హోదాలో పెన్షన్ల పెంపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పెంపు ఫైల్ పై మూడో సంతకం చేశారు. తాజాగా రాష్ట్రంలో పెన్షన్లు పెంచుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెరిగిన పెన్షన్ల ప్రకారం.. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకారులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15 వేలు అందించనుంది. దీని ప్రకారం.. జూలైలో ఈ 3 నెలల బకాయి 3 వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7 వేలు అందుతాయి.
కాగా గత వైసీపీ ప్రభుత్వం ఏటా రూ.250చొప్పున పెంచుతూ… ఐదేళ్లలో రూ.3వేలు చేశారు. కాగా… చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో రూ. వెయ్యి పెంచేశారు. ‘దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 66లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ అర్హులు మొత్తం కలిపి జూలైలో రూ.7వేలు అందుకోనున్నారు.
ఇక దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచిన ప్రభుత్వం.. వారికి గత బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుంది కొత్త ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు సర్కర్.