జూనియర్ డాన్సర్ పై లైంగిక దాడి కేసులో ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలను రాబట్టారు. ఈ నేపధ్యంలో మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు జానీ మాస్టర్. ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసాడు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని కోర్టును జానీ న్యాయవాదులు కోరారు.
జానీ మాస్టర్ మధ్యంతర మెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను జానీ మాస్టర్ దాఖలు చేసాడు. ఈ పిటీషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు.