Nizamsagar canal : జల దిగ్భందంలో జర్నలిస్ట్ కాలనీ… తెగిపోయిన నిజాంసాగర్ కెనాల్ కట్ట

నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే.. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయాయి.

నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే.. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు కాలనీ వాసులు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో పలు ఇండ్లలోని సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు సంఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో కెనాల్ కట్ట తెగిన ప్రాంతంలో మట్టితో పూడ్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ కెనాల్ విషయంలో పలుమార్లు స్థానిక కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

SURESH.SSM