Jr NTR, Earthquake : జపాన్ నుంచి క్షేమంగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్

హమ్మయ్య.. జూనియర్ ఎన్టీఆర్ జపాన్ నుంచి క్షేమంగా ఇండియాకి తిరిగి వచ్చాడు. జపాన్ లో సోమవారం నాడు భారీ భూకంపం రాగా.. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇదే టైమ్ లో ఫ్యామిలీ ట్రిప్ కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కి వెళ్ళడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందారు. అయితే తాను క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చినట్టు X వేదికగా తారక్ ట్వీట్ చేయడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

కొత్త ఏడాది రోజునే జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అక్కడి అధికారులు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చాలా చోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే టైమ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. ఫ్యామిలీతో కలిసి జపాన్‌ ట్రిప్పుకు వెళ్ళారు. వారం రోజులుగా ఆయన జపాన్ లోనే గడిపారు. సినిమాల్లో బిజీగా ఉండే తారక్… ఖాళీ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ వేస్తుంటాడు. అందులో భాగంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. భార్య ప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌తో కలిసి జపాన్‌కు వెళ్ళారు. ఉన్నట్టుండి అక్కడ భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ నార్త్ సెంట్రల్‌లో మొదలైన ప్రకంపనలు.. దేశవ్యాప్తంగా వచ్చాయి. సునామీ హెచ్చరికలు కూడా జారీ అవడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని లక్షల మందిని ప్రభుత్వం ఖాళీ చేయించింది. సముద్ర తీర అలలు కూడా ఒకటిన్నర మీటర్ల ఎత్తు దాకా ఎగిసిపడ్డాయి. ఇది 5 మీటర్లకు కూడా చేరవచ్చని హెచ్చరించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఎలా ఉన్నాడని అభిమానులు ఆవేదన చెందారు. ఆయన క్షేమంగా కుటుంబంతో కలిసి ఇంటికి రావాలని అభిమానులు ప్రార్థించారు.

అయితే అదృష్టవశాత్తూ జూనియర్ ఎన్టీఆర్ జపాన్ భారీ భూకంపం నుంచి బయటపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఇండియాకు తిరిగి వచ్చాడు. తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నాననీ.. X లో ట్వీట్ చేయడంతో అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. జపాన్ భూకంపంపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశాడు తారక్. గత వారం అంతా జపాన్ లోనే గడిపానని తెలిపాడు. భూకంప బాధితులను తలుచుకుంటే బాధగా ఉంది. ఈ విపత్తు నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. స్టే స్ట్రాంగ్.. జపాన్ అంటూ ట్వీట్ చేశాడు.