K KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైలులో ఉన్న కవితకు మరో పెద్ద షాక్ తగిలింది. ఇదే కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కవిత జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తిహార్ జైలులోనే కవితను ఇప్పుడు సీబీఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన డేటాకు సంబంధించి కవితను కీలక విషయాలు అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో తీసుకున్న డబ్బుతో ఏం ఆస్తులు కొన్నారు అనే కూపీ కూడా సీబీఐ బయటికి లాగే ఛాన్స్ ఉంది.
KCR: రైతులకు న్యాయం చేయకపోతే వెంటాడుతాం.. నీళ్లున్నా విడుదల చేయరా: కేసీఆర్
ఇప్పటికే ఈడీ కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు సీబీఐ కూడా రెడీ అయ్యింది. ఇవన్నీ చూస్తే కవిత ఇక జైలుకే అంకితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో బెయిల్ కోసం కవిత పిటిషన్ ఇచ్చినా.. ఆమెకు కోర్టు నుంచి ఊరట మాత్రం లభించలేదు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి అటూఇటూగా నెల కావస్తోంది. స్కాంలో కవిత ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేందుకు అన్ని ఆధారాలు సమకూర్చారు అధికారులు. ఇలాంటి సిచ్యువేషన్‌లో కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అంటున్నారు. గతంలో ఢిల్లీ డిప్యుటీ సీఎం సత్యేంద్ర జైన్ కూడా దాదాపు ఇదే పరిస్థితిలో అరెస్ట్ అయ్యారు. విచారణ పూర్తవ్వగానే బెయిల్ వస్తుంది అనుకుంటే.. దాదాపు సంవత్సరం పాటు ఆయన జైల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరగబోతోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో కవిత ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని తేలినా. ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. స్కాంలో సంపాదించిన డబ్బుతో కవిత ఏం చేశారు. ఆ ఇష్యూలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇప్పటికీ సస్పెన్సే.
అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు కవిత మౌనంగానే ఉన్నారట. చేసేదేమీ లేక అధికారులు కస్టడీ ముగియగానే జైలుకు తరలించారు. ఇప్పుడు సీబీఐ కూడా ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. ఈ విచారణలో తెలిసే నిజాలను బట్టి ఈడీ మరోసారి కవితను కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. దీనికి తోడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైలులోనే ఉన్నారు. వీళ్లిద్దరినీ కలిపి విచారించే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు చాలా కాలం నుంచీ టాక్ నడుస్తోంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఇక కవితకు బెయిల్ రావడం కష్టమే అంటున్నారు. తక్కువలో తక్కువ ఆరు నెలలు ఐనా కవితకు జైలు జీవితం తప్పదు అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయిం తీసుకుంటుందో చూడాలి మరి.