K Keshava Rao: బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. బలమైన నేతలు అనుకున్న వాళ్లు.. బలంగా ఉంటారు అనుకున్న వాళ్లు.. ఒక్కొక్కరుగా కేసీఆర్‌కు హ్యాండ్ ఇస్తున్నారు. కేసీఆర్ తర్వాత స్థానం అంతటి ప్రాధాన్యం ఉన్న పదవిలో కొనసాగిన కేకే కూడా.. పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిజానికి కేకే జంప్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా.. దీని మీద వివణ ఇచ్చేందుకు ఫామ్‌హౌస్ వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ లాంటి మహావృక్షం.. తగ్గాల్సి వస్తోందా..?
ఇద్దరి మీటింగ్‌లో ఆసక్తికర, ఎమోషనల్ పరిణామాలు చోటుచేసుకున్నాయ్. పార్టీ మార్పుపై కేకే వివరణ ఇస్తుండగా.. కేసీఆర్ తీవ్ర అసహనానికి లోనయినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పదేళ్లు పార్టీలో, ప్రభుత్వంలో అన్ని రకాల పదవులు అనుభవించి.. అధికారం కోల్పోగానే పార్టీ మారడం కరెక్ట్ కాదని.. మీ ఆలోచన తప్పు అని.. జనాలు అన్నీ గమనిస్తున్నారని కేకే మీద కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. పార్టీలో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చినా.. కష్టసమయంలో ఇలా హ్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కేకే వివరణ ఇస్తుండగా.. కేసీఆర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాకులు చెప్పొద్దంటూ.. కేకే మీద గుస్సా అయ్యారని ఫామ్‌హౌస్ వర్గాల టాక్. కేసీఆర్ కోపంతో ఊగిపోవడంతో.. చెప్పేదేమి లేదు ఉన్నట్లుగా.. మీటింగ్ మధ్యలోంచే ఫామ్‌హౌస్‌ను విడిచి కేకే వెళ్లిపోయారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా.. ఒకరకంగా ఆ పార్టీలో కేకేకు రెండో స్థానం కల్పించారు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ మారుతుండడం.. గులాబీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయ్. మరిన్ని వలసలు ఖాయంగా కనిపిస్తున్నాయ్. కేకేతో పాటు ఆయన కూతురు, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు.