K Srinivas Reddy : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ గా ‘ప్రజాపక్షం’ పత్రికకు ఎడిటర్ కే శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గత ప్రభుత్వం మారగానే.. రాష్ట్రంలో ఉన్న చాలా పదవులకు రాజీనామాలు చేయ్యడం జరుగుతుంది. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని.. ప్రస్తుత ప్రభుత్వం వారిని పదవుల నుంచి తొలగించడం వంటి జరుగుతున్నాయి. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్‌ పోస్టులను రేవంత్‌రెడ్డి సర్కారు భర్తీ చేస్తున్నది.

తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ కే శ్రీనివాస్‌ రెడ్డికి (K Srinivas Reddy) ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దీంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరు అవుతారనే చర్చకు తెరపడింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇంతకు ముందే పని చేశారు. ప్రస్తుతం ఆయన ‘ప్రజాపక్షం’ (Praja Paksha) పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆ పదవిలో కొనసాగారు. మాజీ సీఎం కేసీఆర్ అల్లం నారాయణ పది కాలం అయిపోయిన మూడు సార్లు ఆయనను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవి కాలం పొడిగించి మరి.. నియమించారు.