కాకినాడ; చూస్తుండగానే సముద్రం వెనక్కు

ఈ మధ్య కాలంలో సముద్రాలు వెనక్కు వెళ్ళడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. విశాఖలో సముద్రం వెనక్కు వెళ్ళడం చూసి అందరూ కంగారు పడ్డారు. అక్కడ నివసించే వారు మాత్రం అది సాధారణం అంటూ సమాధానం ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 12:19 PM IST

ఈ మధ్య కాలంలో సముద్రాలు వెనక్కు వెళ్ళడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. విశాఖలో సముద్రం వెనక్కు వెళ్ళడం చూసి అందరూ కంగారు పడ్డారు. అక్కడ నివసించే వారు మాత్రం అది సాధారణం అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఇదే సంఘటన ఇప్పుడు కాకినాడలో చోటు చేసుకుంది. సందర్శకులు చూస్తుండగానే ఒక్కసారిగా ఉప్పాడలో సముద్రం వెనక్కు వెళ్లిపోయింది.

నిత్యం అలలుతో ఎగసిపడే ఉప్పాడ సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో విపత్తు సంభవించే విపత్తు వచ్చే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబ్బంపేట, ఎస్ పి జి ఎల్ శివారులో వద్ద సముద్రం వెనక్కి వెళ్లడంతో అక్కడ ఉండే పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఒకపక్క తుఫాను,ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు. సముద్రం నీటిమట్టం పెరుగుదల కనిపించాలని, అలాంటిది సముద్రం వెనక్కి వెళ్లడం ఏంటీ అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు, సందర్శికులు ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.