కాళేశ్వరం కమీషన్: మాకే పాపం తెలీదు, అంతా ఆ ముగ్గురే: అధికారులు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టె లక్ష్యంతో ఏర్పాటైన కాళేశ్వరం కమీషన్ విచారణ కీలక దశలో ఉంది. కాలేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరైన మాజీ ఈఎన్సి మురళీధర్ రావు పలు కీలక విషయాలను వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 05:16 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టె లక్ష్యంతో ఏర్పాటైన కాళేశ్వరం కమీషన్ విచారణ కీలక దశలో ఉంది. కాలేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరైన మాజీ ఈఎన్సి మురళీధర్ రావు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇవాళ మాజీ సిఈ సిడీఓ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరు అయ్యారు. 2:30 గంటల పాటు కొనసాగిన విచారణలో పలు కీలక విషయాలను వీరు బయటపెట్టినట్టు తెలుస్తోంది. 14 పేజీల ప్రశ్నలు కమీషన్ సంధిస్తే వాటిల్లో కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పారని సమాచారం.

చాలా ప్రశ్నలకు సమాధానాలు నరేందర్ రెడ్డి చెప్పలేదు. డిజైన్స్ – డ్రాయింగ్స్ L & T, సిడిఓ లు కలిపి తయారు చేశాయని పేర్కొన్నారు. డిజైన్లు, డ్రాయింగ్ విషయంలో ప్రభుత్వానికి ఫైనల్ అప్రూవల్ చేసే ముందు సంతకం చేయలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్లె డిజైన్స్ అప్రూవల్ ఫైల్స్ పై సంతకాలు చేశాను అని తెలిపారు. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్ – డ్రాయింగ్స్ ఏర్పాటు అయ్యాయి అని ప్రతి డిజైన్ లో సిడిఓ తో పాటు ఎల్ అండ్ టి సంస్థ పాల్గొన్నదన్నారు.

నన్ను ఎలాంటి మీటింగ్ లకు, సమావేశాలకు పిలవలేదు అని పేర్కొన్నారు. డిజైన్స్, డ్రాయింగ్స్ అనుమతి విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదు అని నరేందర్ ను కమీషన్ ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని కమిషన్ ముందు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో నేను ఎక్కడా పాల్గొనలేదు నన్ను ఎవరూ పిలవలేదు అని కమీషన్ ముందు ఒప్పుకున్నారు. డి పి ఆర్ కి – గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ కి తేడాలు కనిపిస్తున్నాయి అందులో నిజం ఎంత ఉంది అని నరేందర్ రెడ్డిని కమీషన్ ప్రశ్నించింది.

డిజైన్స్ అప్రూవల్ అంశంలో మాపై ఒత్తిడి ఉన్నది అందుకే హడావిడిగా అన్ని డిజైన్స్ పై అప్రూవల్ చేశామనినిర్మాణం జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ తప్పిదాలు జరిగాయి – ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయి అని అంగీకరించారు. వర్షా కాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అధికారులు, కాంట్రాక్టు సంస్థ పాటించలేదని పై అధికారుల ఒత్తిడి ప్రభుత్వం ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేదు అని ఆయన చెప్పడం గమనార్హం. బ్యారేజీల గేట్ల ఆపరేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ సరిగ్గా చేయలేదని కమీషన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.