అధికారితో దేవుడిపై ప్రమాణం చేయించిన కాళేశ్వరం కమీషన్

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో జరిగిన అక్రమాలను కాళేశ్వరం కమీషన్ త్వరలోనే బయటపెడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 12:56 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో జరిగిన అక్రమాలను కాళేశ్వరం కమీషన్ త్వరలోనే బయటపెడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సి మురళీధర్ హాజరు అయ్యారు. మురళీధర్ను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర గోష్. కమిషన్ అడిగే ప్రశ్నలు – మురళీధర్ చెప్పే సమాధానాలు వెంటనే కమిషన్ నోట్ చేస్తుంది.

విచారణకు ముందు కోర్టు తరహాలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్ తో దేవుని మీద ప్రమాణం చేయించారు ఘోష్. అఫిడవిట్ నీదేనా…. అందులో ఉన్న సంతకాలు నీవేనా? ఇందులో ఇచ్చిన సమాచారం మీరే ఇచ్చారా మురళీధర్ ను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముందు మీరు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ పోస్ట్ ఏంటి అని మురళీధర్ను కమీషన్ అడిగింది.

ENC గా కాలేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి అని మురళీధర్ ను కమీషన్ చీఫ్ ప్రశ్నించారు. డిపిఆర్ ఎవరు సిద్ధం చేశారు అని కమీషన్ ప్రశ్నించగా డిపిఆర్ యాప్ కాన్ సంస్థ ద్వారా తయారు అయిందని సమాధానం ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అందాయి అని కమీషన్ ప్రశ్నించగా కాలేశ్వరం కం ప్రాజెక్ట్ నిర్మాణానికి 17 రకాల అనుమతులు సెంట్రల్ స్టేట్ నుంచి తీసుకున్నామని మురళీ ధర సమాధానం ఇచ్చారు.