ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ఎందరో ప్రముఖ నటీనటులు నటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విజువల్ వండర్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ముంబై నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం కల్కి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్ర నిడివి 2 గంటల 58 నిమిషాలని సమాచారం. ‘కల్కి’ సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. హాలీవుడ్ సినిమాలను తలపించేలా.. విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయట.హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ చేసే విజువల్స్ చూసి సెన్సార్ మెంబర్స్ ఆశ్చర్యపోయారట. షో కంప్లీట్ అయ్యాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టారట. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట.
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందట. అలాగే ఎందరో సినీ ప్రముఖులు గెస్ట్ రోల్స్ లో సందడి చేశారట. ఇండియన్ సినిమాల్లో స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడనటువంటి విజువల్స్ ఉన్నాయని, స్టోరీ లైన్ ఇంప్రెసివ్ అండ్ యూనీక్ అని, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ కొట్టేలా సినిమా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎండింగ్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అని టాక్. మొత్తానికి ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో సంచలనాలు సృష్టించగల సరైన సినిమా ‘కల్కి’ రూపంలో ప్రభాస్ కి వచ్చిందని చెబుతున్నారు.