Kalki 2898 AD : కల్కిలో కృష్ణుడు ఇతనే..

బాక్సాఫీస్ సరదా తీర్చేస్తోంది కల్కి. ప్రభాస్‌ ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో.. ఆ కటౌట్‌కు కరెక్ట్‌ స్టోరీ పడితే ఇంపాక్ట్ ఏంటో.. కల్కితో ప్రూవ్ అయింది.

బాక్సాఫీస్ సరదా తీర్చేస్తోంది కల్కి. ప్రభాస్‌ ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో.. ఆ కటౌట్‌కు కరెక్ట్‌ స్టోరీ పడితే ఇంపాక్ట్ ఏంటో.. కల్కితో ప్రూవ్ అయింది. వారం వరకు థియేటర్లన్నీ హౌజ్‌ఫుల్‌. వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటేయడం ఈజీ అంటున్నాయ్ మార్కెట్ వర్గాలు. స్టోరీ, విజువల్స్‌తో పాటు ఊహించని క్యామియోలతో కల్కి 2898 ఏడీ.. కేక పుట్టిస్తోంది. అమితాబ్‌ ఓపెనింగ్‌ సీన్‌తో.. మూవీ స్టార్ట్ అవుతుంది. అశ్వత్థామ పాత్రలో ఉన్న అమితాబ్‌.. కృష్ణుడితో ఫైట్ చేసే సీన్‌.. సినిమాలోకి ఇలా లాక్కెళ్తుంది. సినిమా మధ్యమధ్యలో కనిపించే కృష్ణుడి పాత్ర.. ఎవరు అనేది డైరెక్టర్ రివీల్ చేయలేదు.

ఆ పాత్ర కనిపించిన ప్రతీసారి షాడోతో కృష్ణుడిగా చేసింది హీరో నాని అని కొందరు.. కాదు కాదు అంటూ ఇంకొందరు చర్చ మొదలుపెట్టారు. దీంతో కృష్ణుడి పాత్రలో యాక్ట్ చేసింది ఎవరా అని సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఐతే ఇప్పుడు ఆ కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది. ఆ క్యారెక్టర్‌ ప్లే చేసిన నటుడే సోషల్‌ మీడియా వేదికగా స్పందించడంతో ఆన్సర్ దొరికింది. ఈ పాత్రలో యాక్టి చేసింది తమిళ నటుడు కృష్ణ కుమార్‌. ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. డబ్బింగ్‌ చిత్రం ఆకాశం నీ హద్దురాతో పలకరించారు.

సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో ఆయనకు స్నేహితుడిగా నటించారు కేకే. ధనుష్‌ మారన్‌లోనూ కీలక పాత్ర పోషించారు. కాదళగితో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు.. కల్కి ఐదో చిత్రం. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ అర్జునుడిగా నటించి, ఆకట్టుకున్నారు. దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, అనుదీప్‌ కేవీ, నటులు దుల్కర్‌ సల్మాన్‌, ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొందరు
అతిథి పాత్రల్లో సందడి చేశారు.