Kalki : హాలీవుడ్ రేంజ్ లో కల్కి ట్రైలర్ రిలీజ్.. రికార్డ్స్ చూసుకో…

ఇటీవల కాలంలో మరే సినిమా కోసం ఎదురు చూడనంతగా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (star Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి నాగ్ అశ్విన్ దర్శకుడు.

 

 

 

ఇటీవల కాలంలో మరే సినిమా కోసం ఎదురు చూడనంతగా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (star Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, బుజ్జి (Bujji) టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

3 నిమిషాల నిడివి గల ‘కల్కి ట్రైలర్ (Kalki trailer) అద్భుతంగా ఉంది. విజువల్ వండర్ కి పర్యాయపదంగా ప్రతి ఫ్రేమ్ ఉంది. ఆ విజువల్స్ కి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏదో హాలీవుడ్ మూవీ ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంది. ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర ఎంత బలంగా ఉందో.. దానికి ధీటుగా అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఉండటం విశేషం. ఇక “రికార్డ్స్ చూస్కో..ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు” అంటూ ప్రభాస్ పలికిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. “భయపడకు మరో ప్రపంచం వస్తోంది” అంటూ కమల్ హాసన్ డైలాగ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు భలే ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా విడుదల తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలో ఒక్క రికార్డు కూడా మిగలదేమో అనిపిస్తోంది.

జూన్ 27న థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనే విషయం అయితే ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.ఇప్పుడు కథ పరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ ఒక క్లియర్ థాట్ తో థియేటర్లకు తీసుకురావాలి అనేది ఉద్దేశం కావచ్చు.ఇంక ఈ ట్రైలర్ లో ప్రతి క్యారెక్టర్ ని పరిచయం చేసినట్లు ఉంది. కానీ, ఇంకా కొన్ని పాత్రలను సిల్వర్ స్క్రీన్ మీద సర్ ప్రైజ్ చేసేందుకు దాచి ఉంచారు అనే భావన కలుగుతోంది. అయితే ఇన్నాళ్లు భైరవకు అశ్వత్థామ గురువు అవుతారు అనుకున్నారు. కానీ, అశ్వత్థామకు భైరవ పోటీ అవుతున్నాడు. వారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ కచ్చితంగా విజిల్వ్ వేయించే విధంగానే ఉంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ‘కల్కి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.