Telangana BJP : తెలంగాణలో స్పీడ్ పెంచిన కమలం పార్టీ

పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) దిశగా స్పీడ్‌ పెంచింది బీజేపీ(BJP) . ఇన్నాళ్ళు పెండింగ్‌లో పెట్టిన రాజకీయ, సంస్థాగత నిర్ణయాలను చకచకా క్లియర్‌ చేస్తోంది. ఆ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న తెలంగాణ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణ నుంచి పది లోక్‌సభ సీట్లు (Lok Sabha Elections) టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ.

పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) దిశగా స్పీడ్‌ పెంచింది బీజేపీ(BJP) . ఇన్నాళ్ళు పెండింగ్‌లో పెట్టిన రాజకీయ, సంస్థాగత నిర్ణయాలను చకచకా క్లియర్‌ చేస్తోంది. ఆ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న తెలంగాణ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణ నుంచి పది లోక్‌సభ సీట్లు (Lok Sabha Elections) టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. అదేమంత ఈజీ టాస్క్‌ కాదు గనుక అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం మొదలైంది. దాదాపు 18 నెలల తర్వాత సంస్థాగత ప్రధాన కార్యదర్శిని తాజాగా అపాయింట్‌ చేసింది. టఫ్‌ లీడర్‌గా పేరున్న రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి తివారీని ఇక్కడికి పంపించింది. మరోవైపు ఏ రాష్ట్రానికి లేనంత మంది ఇంఛార్జిలు తెలంగాణకు ఉన్నారు. మంది ఎక్కువ అవడంవల్లే.. పనులు సక్రమంగా జరగడం లేదన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారట కమమనాథులు. పది మందిలో పాము చావదన్న సామెత తమకు కరెక్ట్ గా సూట్ అవుతుందని పార్టీ నేతలే అంటున్నారు. అందుకే అంత మందిని తప్పించి ఒక్కరికే బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఇన్నాళ్ళు తెలంగాణ ఇన్ఛార్జ్‌గా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ (Tarun Chugh) ను జమ్ము కాశ్మీర్‌కు (Jammu and Kashmir) బదిలీ చేసింది. అలాగే జాతీయ కార్యదర్శి, మరో ఇన్ఛార్జ్‌ అరవింద్ మీనన్‌ను తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించింది. దీంతో ఈ ఇద్దరు నేతలు ఇక తెలంగాణ వైపు రారనీ, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ముందున్న షెడ్యూల్‌ ప్రకారం ఇద్దరు నాయకులు సోమవారం తెలంగాణలో పర్యటించాల్సి ఉందనీ… ఆ కార్యక్రమాలు రద్దవడమే ఇందుకు నిదర్శనమంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.

ఇక వివిధ రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించిన బిజెపి కేంద్ర నాయకత్వం… తెలంగాణకు మాత్రం ఇంకా నియమించలేదు… ఎవరినైనా వేస్తారా లేక జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సలే ఆ బాధ్యతలు కూడా చూస్తారా అనే చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగిస్తారని ఓ వర్గం, సునీల్ బన్సలే అంతా చూసుకుంటారని మరో వర్గం అంటున్నాయి. ఎవరు చూసుకున్నా… ఏం చేసినా… మొత్తంగా లోక్‌సభ ఎన్నికల విషయంలో అసెంబ్లీ తప్పులు రిపీట్‌ అవకుండా బీజేపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నది మాత్రం వాస్తవం అంటున్నాయి రాజకీయవర్గాలు.