100 కోట్ల బడ్జెట్ అన్నది చాలా సాధారణమైపోయిన రోజులివి. అంతకంటే తక్కువ పెట్టి నిర్మిస్తే ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుందని ఫీల్ అవుతున్న నిర్మాతలు కూడా ఉన్నారు. ఆయినా హీరోగారి పారితోషకమే 50 కోట్లకు పైగా ఉంటుంది.. ఇక వంద కోట్ల బడ్జెట్ అన్నది సింపూల్ మేటర్. అయితే చిన్న సినిమాలు అలా కావు.. 10 కోట్ల లోపే బడ్జెట్ ఉంటుంది.. వందల కోట్ల షేర్ వసూలు చేస్తుంటాయి.. ఇటీవల పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ జంటగా నటించిన ‘మిమి’ చిత్రం ఈ విషయాన్ని రుజువు చేసింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.298 కోట్లు వసూలు చేసింది. అయితే పుష్కర కాలం కిందటే తెలుగు, తమిళంలో వచ్చిన మరో సినిమా కూడా తక్కువ బడ్జెట్‌లో వచ్చి వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
2011లో విడుదలైన కాంచన సినిమా గుర్తింది కదా. ఈ చిత్రానికి ‘ముని 2: కాంచన’ అని పేరు కూడా పెట్టారు. రాఘవ లారెన్స్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం ఇది. ఇది ముని (2007)కు సీక్వెల్. ముని సిరీస్‌లో రెండో సినిమా. లారెన్స్, శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన కాంచన చిత్రంలో దేవదర్శిని, శ్రీమన్ సహాయక పాత్రల్లో నటించారు. బయటకు వెళ్లాలంటే భయపడే రాఘవ్(లారెన్స్) చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ సినిమా అప్పట్లో ఓ సెన్‌సేషన్. ముఖ్యంగా శరత్ కుమార్ నటల ఈ సినిమాకే హైలెట్. ముని సీక్వెల్‌లో వచ్చిన సినిమాల్లో ఈ చిత్రం అన్నిటికంటే పెద్ద హిట్. రూ.108 కోట్లు రాబట్టిన ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.7కోట్లు మాత్రమే. అంటే 15రెట్లు ఎక్కువ మార్కెట్ చేసిందీ సినిమా. నిజానికి ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ప్రేక్షకులు ఎగబడి చూశారు. ముని-1కి పాజిటివ్ టాక్ వచ్చినా.. 2007టికెట్ లెక్కలు వేరు.. 2011 టికెట్ లెక్కలు వేరు. 2020లో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రం కాంచన-2కు రీమేక్. ఇలా బాలీవుడ్‌లోనూ ఈ సినిమా సీక్వెల్స్ ఓ వర్గం ప్రేక్షకులను అలరించాయి. మిమి, ముని లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్‌తోనే తీసినా.. బాక్స్‌ఫిస్ వద్ద మాత్రం కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి.