ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ప్రముఖ వ్యాపారవేత్త (Businessman) రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh (Ambani). ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధికా మర్చంట్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఇక ఈ పార్టీకి హాజరుకానీ సినీతారలు సైతం చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ తార కంగనా రనౌత్. తాజాగా కంగనా మాట్లాడుతూ..అంబానీ పార్టీకి హాజరైన సెలబ్రిటీలపై తనదైన శైలిలో విరుచుకుపడింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి
బాలీవుడ్ (Bollywood) వివాదాల క్వీన్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంటుంది. అంతేకాదు..ఈ మధ్య మరింతగా రెచ్చిపోయింది ఈ భామ. తాజాగా కంగనా ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ..ఇలా రాసుకొచ్చింది.మూడురోజుల పాటు, బాలీవుడ్ తారలు వారి అద్భుతమైన ప్రదర్శనలతో ఈ వేడుకలు తమ జీవితంలో ఎప్పటికి మధురజ్ఞాపకాలుగా గుర్తుండిపోయేలా చేసారు.
ఇదే అంశంపై కంగనా మాట్లాడుతూ..నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా..నేను ఎప్పుడూ పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయలేదు. నాకు చాలా సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు నేను అవార్డు షోలకు కూడా దూరంగా ఉన్నాను. పాపులారిటీ, డబ్బుకు నో చెప్పడానికి బలమైన క్యారెక్టర్, గౌరవంగా ఉండటం చాలా అవసరమని హాట్ కామెంట్స్ చేసింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 2024లో జరుగుతుండగా.. అంతకు ముందు ముఖేష్ అంబానీ దేశ, విదేశాల ప్రముఖుల కోసం ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు.
ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు ఇతర అతిథులు అమూల్యమైన సమయాన్ని గడిపారు. సినీ ప్రముఖుల్లో బిగ్‌బీ అమితాబ్, రజనీకాంత్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్, వరుణ్‌ధావన్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, రాణిముఖర్జీ, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరి కంగనా రనౌత్ అలా మాట్లాడటం ఏంటని ఈ ఈవెంట్‌కి హాజరైన పలువురు తారల అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.