2G Spectrum Case Kanimozhi : నెక్ట్స్ కనిమొళి అరెస్ట్ తప్పదా ? 2జీ కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ

కుంభకోణాల్లో ఇరుక్కున్న ప్రతిపక్ష నేతలు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత, కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు కనిమొళి మరోసారి జైలుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2జీ స్కామ్ లో తమిళనాడు DMK ఎంపీ కనిమొళఇ పాటు డి.రాజాపై ఢిల్లీ హైకోర్టులో వచ్చే మే నెల నుంచి విచారణ జరగబోతోంది.

 

 

కుంభకోణాల్లో ఇరుక్కున్న ప్రతిపక్ష నేతలు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత, కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు కనిమొళి మరోసారి జైలుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2జీ స్కామ్ లో తమిళనాడు DMK ఎంపీ కనిమొళఇ పాటు డి.రాజాపై ఢిల్లీ హైకోర్టులో వచ్చే మే నెల నుంచి విచారణ జరగబోతోంది.

2జీ స్ప్రెక్ట్రమ్ దుర్వినియోగం కేసు… దేశంలో అతి పెద్ద స్కామ్స్ లో ఒకటి. కాంగ్రెస్ హయాంలో జరిగిన లక్షా 76 వేల కోట్ల రూపాయల కుంభకోణం. 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతకవలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. పబ్లిక్ బిడ్డింగ్ కి బదులుగా ముందుగా వచ్చిన వాళ్ళకు లబ్ది చేకూరే విధానాన్ని అనుసరించడం వివాదస్పదమైంది. అప్పట్లో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజాతో పాటు, DMK ఎంపీ కనిమొళిపై ఈ ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో కూడా క్విడ్ ప్రో కో దాగి ఉంది. 30 వేల కోట్ల దాకా అక్రమాలు జరిగినట్టు CBI అప్పట్లో కేసులు పెట్టింది. స్వాన్ టెలికాం కంపెనీకి 2G లైసెన్సులను తక్కువ మొత్తానికి కేటాయింపులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ప్రతిఫలంగా DMKకు చెందిన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపులకు 200 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిన కేసును కూడా ఇందులో చేర్చారు. అర్హతలేని కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం వచ్చినట్టు సీబీఐ ఛార్జ్ షీటులో తెలిపింది.

మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ తిహార్ జైలుకు పంపింది. ఆ తర్వాత అందరూ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులుగా 2018లో రిలీజ్ అయ్యారు. ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి తీర్పును సవాల్ చేస్తూ CBI, ED అధికారులు ఢిల్లీ హైకోర్టులో అప్పట్లో అప్పీలు చేశారు. 2G స్పెక్ట్రమ్ కేసులో CBI అప్పీళ్ళను విచారణకు స్వీకరిస్తామని ఢిల్లీ హైకోర్టు ఈమధ్యే ప్రకటించింది. ఈ అప్పీళ్ళపై మే నుంచి విచారణ చేస్తామంటోంది న్యాయస్థానం. సరిగ్గా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న టైమ్ లోనే మరోసారి 2G స్పెక్ట్రమ్ కేసుపై విచారణ మొదలవుతోంది. దాంతో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ కి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.