Murder : డబ్బు కోసం కన్న కూతురినే ఎరగా వేసింది.. ఇది మామూలు కిలాడీ కాదు..

యూసుఫ్‌గూడలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్‌లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్‌ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.

 

 

 

యూసుఫ్‌గూడలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్‌లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్‌ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు. ఇక్కడిదాకా ఒక కథ ఐతే.. రామును హనీ ట్రాప్‌ చేసిన మహిళది అంతకు మించిన స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సెంటర్‌ పాయింట్‌గా ఉన్న హిమాంబి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందని మహిళ. కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి కూతురు నసీమాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది హిమాంబి.

యూసుఫ్‌గూడాలోని ఓ కానిస్టేబుట్‌ ఇంట్లో హిమాంబి అద్దెకు దిగింది. రెంట్‌ కోసం తరచుగా వస్తుండటంతో కానిస్టేబుల్‌కు హిమాంబికి పరిచయం పెరిగింది. కొన్ని రోజులకు అది వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అప్పటి నుంచి తన కుటుంబం కంటే హిమాంబితోనే ఎక్కువగా ఉండేవాడు ఆ కానిస్టేబుల్‌. కొన్ని రోజులకు తన భార్యా పిల్లలకు పూర్తిగా దూరమయ్యాడు. కానిస్టేబుల్‌టు బుట్టలో వేసుకున్న హిమాంబి తాను అద్దెకు దిగిన ఇంటిని తన పేరు మీద రాయించుకుంది. ప్రాపర్టీ తన పేరు మీదకు మారగానే కానిస్టేబుల్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. పరువు పోతుందనే భయంలో ఏం మాట్లాడకుండా ఆ ఇంటికి వదిలేశాడు ఆ కానిస్టేబుల్‌. అప్పటిం నుంచి ఆ ఇంటిని కేంద్రంగా చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది హిమాంబి. తనకు పరిచయం ఉన్న వ్యక్తులను ఇంటికి పిలిపించి.. అక్కడే వ్యాపారం చేయడం మొదలు పెట్టింది. బడాబాబులను టార్గెట్‌ చేసి వాళ్లతో సంబంధాలు పెట్టుకునేది. తరువాత వాళ్లను బెదిరించి వాళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేది.

ఇదే క్రమంలో మరి కొందరు యువతులను కూడా వ్యభిచార కూపంలోకి లాగింది. 2017లో షేక్‌ సన అనే యువతితో వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా దొరికిపోయింది. 2018లో కూడా రేణుక అనే అమ్మాయితో దొరికిపోయింది. ఆఖరికి తన కన్న కూతురిని కూడా వదలకుండా ఇదే వృత్తిలోకి తీసుకువచ్చింది. ఇలా హిమాంబి మీద 8 ఏళ్లలో 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇదే క్రమంలో సింగోటం రాముతో హిమాంబికి పరిచయం ఏర్పడింది. హిమాంబిని కలిసేందుకు యూసుఫ్‌గూడలోని ఆమె ఇంటికి రాజు అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అక్కడే హిమాంబి కూతురు నసీమాను చూసి మనసు పడేసుకున్నాడు. అప్పటి నుంచి నసీమాను కూడా తనకు అప్పగిస్తానంటూ రామును ఆశపెట్టి అతని నుంచి భారీగా డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టింది హిమాంబి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసే రాము.. హిమాంబి ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. రీసెంట్‌గా తన కూతురిని ఎప్పుడు పంపిస్తావంటూ రాము హిమాంబితో గొడవపడ్డాడు.

దీంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్‌ అయ్యింది. రాము ప్రత్యర్థి మణికంఠతో చేతులు కలిపింది. ఎప్పటి నుంచో రాముపై రివేంజ్‌ తీర్చుకోవాలని వెయిట్‌ చేస్తున్న మణికంఠ.. హిమాంబి డీల్‌కు ఓకే అన్నాడు. ఇద్దరూ కలిసి ప్లాన్‌ వేసి రామును యూసుఫ్‌గూడకు రప్పించారు. హిమాంబి దగ్గరికి అవ్వడంతో రాము ఒక్కడే వచ్చాడు. అతను ఇంట్లో ఉండగా మణికంఠ తన గ్యాంగ్‌తో వచ్చి రామును అత్యంత కిరాతంగా హతమార్చాడు. మొదట ఈ గేమ్‌లో హిమాంబ్‌ ఓ క్యారెక్టర్‌ మాత్రమే అనుకున్నారంతా. కానీ మొత్తం గేమ్‌ నడిపిందే హిమాంబి అని.. ఒకడిని అడ్డుతొలగించేందు ప్రత్యర్థి గ్యాంగ్‌ను దించిందని తెలిసి పోలీసులే షాక్‌ అయ్యారు. ప్రస్తుతం హిమాంబి ఆమె కూతురు నసీమా ఇద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించే ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు వస్తాయో చూడాలి.