ఫలితం కష్టమే ! కాన్పూర్ టెస్ట్ ఇక డ్రానే

భారత్ , బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. మొదటి రోజు 34 ఓవర్ల ఆట మాత్రమే జరగ్గా... రెండోరోజు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 11 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టినా సిబ్బంది కవర్లు తీసేలోపే మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - September 28, 2024 / 04:53 PM IST

భారత్ , బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. మొదటి రోజు 34 ఓవర్ల ఆట మాత్రమే జరగ్గా… రెండోరోజు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 11 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టినా సిబ్బంది కవర్లు తీసేలోపే మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇచ్చాడు. లంచ్ తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే మైదానంలో భారీగా నీరు నిలిచిపోయింది. సూపర్ సోపర్స్ తో సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఔట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. చివరికి రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

అయితే బీసీసీఐ పై క్రికెట్ ఫాన్స్ మండిపడుతున్నారు. కాన్పూర్ లాంటి పెద్ద స్టేడియంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
శుక్రవారం ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ , మోమినుల్ హక్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. కాగా తొలి టెస్టులో గెలిచిన భారత్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.