JANASENA KAPU COMMUNITY: కస్సుమంటున్న కాపులు.. జనసేనకు 24 సీట్లపై రగిలిపోతున్న కాపులు

కాపు నేతలు ఎన్ని సూచనలు చేసినా.. 50సీట్ల కంటే తగ్గొద్దు అని డిమాండ్లు వినిపించనా.. పవన్ అవేమీ పట్టించుకున్నట్లు కనిపించలేదు. చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లు తీసుకున్నట్లు అనిపిస్తున్నారు. 24 సీట్లకు మించి ఎక్కువ తీసుకురాలేకపోయానని చెప్పారు.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 04:31 PM IST

JANASENA KAPU COMMUNITY: టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ 24 సీట్లకు ఫిక్స్ అయ్యారు. కాపు నేతలు ఎన్ని సూచనలు చేసినా.. 50సీట్ల కంటే తగ్గొద్దు అని డిమాండ్లు వినిపించనా.. పవన్ అవేమీ పట్టించుకున్నట్లు కనిపించలేదు. చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లు తీసుకున్నట్లు అనిపిస్తున్నారు. 24 సీట్లకు మించి ఎక్కువ తీసుకురాలేకపోయానని చెప్పిన పవన్‌.. తన నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు దిక్కుమాలిన లాజిక్‌ మాట్లాడారు ఒకటి. వీటిని 24 సీట్లలా మాత్రమే చూడొద్దని.. మనం చూడాల్సింది 98శాతం స్ట్రైక్ రేట్ అని.. పోటీ చేయబోయే 3 పార్లమెంట్ సీట్ల కిందకు వచ్చే ఎమ్మెల్యే సీట్లు కూడా లెక్కేసుకుంటే.. మనం మొత్తం 40సీట్లలో పోటీ చేస్తున్నట్లు అంటూ వివరణ ఇచ్చారు.

TDP-BJP: కమలంతో దోస్తీ.. ఏపీలో బీజేపీకి టిక్కెట్లు ఎన్ని..?

ఇదేం లాజిక్ బ్రో అంటూ.. పవన్ మాటలు విని జనసైనికులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు అలా ! ఇక ఇదంతా ఎలా ఉన్నా.. జనసేనకు టీడీపీ.. 24 సీట్లు మాత్రమే కేటాయిచడం, దానికి పవన్ అంగీకరించడంపై కాపులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాపులను చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని.. ఆ వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. కాపు నేతల ఆగ్రహం.. ఒకరకంగా వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయ్. 175 స్థానాల్లో 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. గ్లాస్‌ పార్టీని తమ సొంత పార్టీకి ఓన్ చేసుకున్న కాపులు.. ఈ 24 స్థానాల్లో మద్దతుగా నిలిచినా.. మిగిలిన 151 స్థానాల్లో మాత్రం దూరంగా ఉండే చాన్స్ ఉంది. బీజేపీతో పొత్తు లేకపోతే.. మిగిలిన 151 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ఉంటారు. సైకిల్ పార్టీ చేసిన అన్యాయానికి భగ్గుమంటున్న కాపులు.. అక్కడ టీడీపీకి మద్దతిచ్చే అవకాశాలు ఏ మాత్రం ఉండే చాన్స్ లేదు.

ఈ లెక్కన టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు.. వైసీపీకి ప్లస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒకరకంగా వైసీపీకి రూట్ క్లియర్‌ చేసేలా పవన్ నిర్ణయాలు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది. దీనికితోడు జనసేనకు ఓడిపోయే సీట్లు ఇచ్చారనే మరో వైపు టాక్ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి టీడీపీ మద్దతు లేకుండా 20సీట్లు గెలుస్తామని.. టీడీపీకి ఎందుకు మద్దతిస్తున్నామని పవన్‌ను సోషల్‌ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు జనసైనికులు.