Food Colours Ban : ఫుడ్ కలర్స్‌ వాడకంపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం.. కృత్రిమ కలర్ వాడితే 7 ఏళ్లు జైలు శిక్ష

ఫుడ్ కలర్స్ పై కర్ణాటక రాష్ట్రం ఓ నిషేధం విధించింది. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.

ఫుడ్ కలర్స్ పై కర్ణాటక రాష్ట్రం ఓ నిషేధం విధించింది. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. కర్ణాటక అంతటా ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్స్‌ వినియోగంపై నిషేధం విధిస్తున్న ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. కర్ణాటక లో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్, ఫిష్ కబాబ్‌, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని పేర్కొంది.

వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. కర్ణాటక లోని ఫుడ్ సేఫ్టీ విభాగానికి కృత్రిమ కలర్స్ వాడకంపై పలుమార్లు ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్‌ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో కూడా కర్ణాటక వ్యాప్తంగా సేకరించిన నమూనాలను పరీక్షించిన రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం… కాలిఫ్లవర్‌తో తయారు చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయిలలో విరివిగా కృత్రిమ రంగులు వాడినట్లు గుర్తించింది. ఈ ఘటనతో అప్పట్లోనే ఆర్టిఫీషియల్ కలర్స్ వాడకం పై నిషేధం ఉన్నప్పటికి.. ఆ నిబంధనను ఎవరు పార్టించడం లేదు. దీంతో ఆర్టిఫీషియల్ కలర్స్ ఉపయోగించే వారికి కర్ణటక ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది.