Kaushik Reddy: జంప్‌ పక్కానా.. కాంగ్రెస్‌లోకి BRS MLA కౌశిక్‌ రెడ్డి..?

వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. త్వరలోనే కౌశిక్‌ రెడ్డి తన సొంత గూటికి తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కీలక నేతలంగా వరుసగా పార్టీ మారుతున్నారు. రోజుకు ఒకరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - January 31, 2024 / 08:06 PM IST

Kaushik Reddy: హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి పెద్ద షాక్‌ తగలబోతోందా..? త్వరలోనే హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పార్టీ మారబోతున్నారా..? ఈ రెండు ప్రశ్నలకు హుజురాబాద్‌లో దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అక్కడ వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. త్వరలోనే కౌశిక్‌ రెడ్డి తన సొంత గూటికి తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కీలక నేతలంగా వరుసగా పార్టీ మారుతున్నారు. రోజుకు ఒకరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు.

AYODHYA TO TIRUMALA: బాల రాముడికి వెంకన్న సాయం.. తిరుమల రద్దీపై అయోధ్య ట్రస్ట్ స్టడీ

ఈ క్రమంలోనే రీసెంట్‌గా జమ్మికుంట మున్సిపల్‌ కౌన్సిలర్లు పార్టీ మారారు. అయితే కౌశిక్‌ రెడ్డే వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని హుజురాబాద్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పార్టీ మారిన ప్రతీ ఒక్కరూ కౌశిక్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. వాళ్లు పార్టీ మారుతున్నా కౌశిక్‌ వాళ్లను ఆపేందుకు ప్రయత్నం కూడా చేయడంలేదు. గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ల వెంటే ఉన్న కౌశిక్‌ రెడ్డి.. వాళ్లంతా పార్టీ మారుతుంటే ఆపేందుకు కూడా ప్రయత్నం చేయకపోవడంతో.. ఆయనే వాళ్లను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు అనే అనుమానాలు మొదలయ్యాయి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కౌశిక్‌ రెడ్డి బంధువు. ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్‌లో ఇంకొకరు బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కౌశిక్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతారు అని అంతా అనుకున్నారు. కానీ కౌశిక్‌ మాత్రం బీఆర్‌ఎస్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు కౌశిక్‌ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని.. అందులో భాగంగానే ముందుగా తన అనుచరులను కాంగ్రెస్‌లోకి పెద్ద మొత్తంలో పంపిస్తున్నారని హుజురాబాద్‌లో టాక్‌.

గతంలో కౌశిక్‌ బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సమయంలో కూడా ఇదే జరిగింది. ఆయన జాయిన్‌ అవ్వడం కంటే ముందే ఆయన అనుచరులు భారీగా బీఆర్‌ఎస్‌లో చేరారు. తరువాత కౌశిక్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సేమ్‌ అదే సీన్‌ మరోసారి హుజురాబాద్‌లో రిపీట్‌ అయ్యే చాన్స్‌ ఉందని హుజురాబాద్‌ రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే నిజంగానే కౌశిక్‌.. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా.. లేక ఆయన అనుచరులు నిజంగానే ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.