ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దాదాపు క్లయిమాక్స్ కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavita Arrest) తో రెండేళ్ళుగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా దొరికితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్సుంది. ఆప్ నేతలకు ఇచ్చేందుకు కవిత తనను 50 కోట్ల రూపాయలు అడిగినట్టు వైసీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు. ఈడీకి స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.
ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ (Business) స్టార్ట్ చేయడానికి తాము సీఎం కేజ్రీవాల్ అపాయింట్ మెంట్ కోరామన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy). తర్వాత ఆయన్ని కలిసినప్పుడు… ఢిల్లీలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని ఆహ్వానించారన్నారు. అక్కడ లిక్కర్ బిజినెస్ చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) 100 కోట్లు ఇస్తామని కవిత అన్నట్టు మాగుంటతో కేజ్రీవాల్ చెప్పారట. అందుకే కవితను సంప్రదించాలని సీఎం సలహా ఇచ్చారు. దాంతో 2021 మార్చి 19 నాడు మాగుంట కవితకు కాల్ చేయగా… తనను స్వయంగా కలవాలని చెప్పారామె. ఆ తెల్లారే కవితను కలిసినట్టు ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మద్యం వ్యాపారంలో ఎంతో అనుభవం ఉందని మాగుంట గురించి కేజ్రీ చెప్పినట్టు కవిత తెలిపింది. ఆప్ కి ఇవ్వడానికి 50 కోట్లు అరేంజ్ చేయాలని మాగుంటను కవిత కోరిందట. అందుకు ఒప్పుకొని… తన కొడుకు రాఘవ ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తాడని కవితకు చెప్పినట్టు శ్రీనివాసులు రెడ్డి వివరించారు. 30 కోట్లు ఇస్తానని చెప్పిన రాఘవ చివరకు కవిత మనుషులైన ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి పాతిక కోట్లు చెల్లించినట్టు ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో వైస్సార్ సీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఈ అక్రమ సొమ్మును ఆప్ నేతలకు కవిత ఆడపడుచు కొడుకు మేకా శరణ్ ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. శరణ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలకంగా వ్యవహరించినట్టు అఫిడవిట్ లో ఈడీ అధికారులు తెలిపారు. శరణ్ ను ఇప్పటికి రెండుసార్లు విచారణకు పిలిచినా రాలేదన్నారు. శరణ్ ను అరెస్ట్ చేస్తే… మరిన్ని విషయాలు బయటపడతాయని ఈడీ భావిస్తోంది.