పదిఫోన్లు పగలగొట్టారన్న అనుమానం.. మరో ఫోన్ లాక్కున్న విధానం.. కవిత ఈడీ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మొదటిసారి విచారణకు పిలిచారు. 9 గంటలు వందల ప్రశ్నలు సంధించారు. 16న మళ్లీ విచారణకు రమ్మన్నారు.. కోర్టు కారణాలు చెప్పి కాస్త టైమ్ అడిగిన కవిత.. ఇప్పుడు విచారణకు రావడం కుదరదన్నారు.. అలా కుదరదు అంటే కుదరదు అని ఈడీ ఖరాఖండీగా చెప్పేసింది. ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయ్ అనేది ఆసక్తికరంగా మారింది. కవితను మొదటిసారి విచారణకు పిలిచినప్పుడు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. కవిత ఇంటి నుంచి ఫోన్ తెప్పించి మరీ.. సీజ్ చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. మొబైల్‌లో వివరాలు ఇప్పుడు కేసులో కీలకంగా మారనున్నాయ్. కవిత పర్సనల్ ఫోన్‌లో చాలా నిజాలు దాగి ఉన్నాయని.. వాటిని ఆరా తీసే పనిలో ఉన్నారు ఈడీ అధికారులు. ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లేంటి.. వెళ్లిన మెసేజ్‌లేంటి అని ఆరా తీయడం ఈడీకి పెద్ద మ్యాటర్ కాదు. నిజానికి ఇప్పటికే పూర్తి చేసి ఉంటారు కూడా ! ఐతే ఈ భయంతోనే కవిత.. రెండోసారి విచారణకు కాస్త టైమ్ కావాలి అనుకుంటున్నారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని.. తన ఫోన్ లాక్కుందని కవిత చెప్తున్న మాటలు దానికే సంకేతమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయ్. ఇప్పుడు ఈడీ దగ్గర ఉన్న ఫోన్ మాత్రమే కాదు.. గతంలో ధ్వంసం చేసిన పది ఫోన్లలో డేటాను కూడా దాదాపు ఈడీ సేకరించిందనే చర్చ నడుస్తోంది. వాట్సాప్ చాటింగ్ నుంచి కాలింగ్ వరకు.. లొకేషన్ సమ్మరీ నుంచి కాల్ డేటా వరకు.. ప్రస్తుతం ఉన్న ఫోన్‌తో పాటు.. పగిలిన పది ఫోన్ల డేటాను ఈడీ సేకరించే అవకాశం ఉంది. కవిత ఫోన్ ద్వారానే లిక్కర్ కేసు నిందితులకు కాల్స్, మెసెజ్‌లు వెళ్లి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ అధికారులు.. వాటా వివరాల గురించి కూడా ఈ 11 ఫోన్ల నుంచే చాటింగ్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. ఈడీ అంచనాలు నిజం అయితే.. నిజంగా నిజాలు బయటకు వస్తే.. లిక్కర్ స్కామ్ ఉచ్చు కవిత చుట్టు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఆ ఫోన్‌లో ఏముంది.. ఆ ఫోన్ ఎక్కడుందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తోంది.