KCR family : బాపు టైటిల్ కోసం కేసీఆర్‌ ఫ్యామిలీ కక్కుర్తి వేషాలు.. కేసీఆర్‌ జాతిపిత ఎలా అవుతాడు ?

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అన్నట్టు మారిపోయింది బీఆర్ఎస్ (BRS) పరిస్థితి. తెలంగాణ ప్రజల్లో తగ్గిపోయిన పాపులారిటీని తిరిగి సంపాదించేందుకు ఓ కొత్త ప్రయోగం మెదలు పెట్టారు బీఆర్ఎస్‌ నేతలు. ఏ చేసైనా మళ్లీ తెలంగాణ (Telangana) సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అన్నట్టు మారిపోయింది బీఆర్ఎస్ (BRS) పరిస్థితి. తెలంగాణ ప్రజల్లో తగ్గిపోయిన పాపులారిటీని తిరిగి సంపాదించేందుకు ఓ కొత్త ప్రయోగం మెదలు పెట్టారు బీఆర్ఎస్‌ నేతలు. ఏ చేసైనా మళ్లీ తెలంగాణ (Telangana) సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. వాళ్లు చేస్తున్న ఈ ప్రయోగంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీఆర్ఎస్‌ చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ఏంటో మీరే చూడండి.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును (Kalvakuntla Chandrasekhar Rao) ఇకనుంచి జనం అంతా బాపు అని పిలవాలట. ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్‌ వ్యూహకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు, వెనక ఉండే చెంచా గాళ్లు అందరూ కలిసి కేసీఆర్‌ను ఇక నుంచి బాపు అని పిలవాలని తీర్మానించారు. అందుకు కావలసినంత గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా బాగా చేశారు. న్యూస్‌ పేపర్స్‌లో ప్రకటనలు ఇచ్చారు. వాట్సప్ ప్రొఫైల్ పిక్‌లో బాపు అంటూ ఫోటోలు పెట్టారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా లాంటి సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో బాపు అని కేసీఆర్‌ని సంబోధిస్తూ ఫోటోలు రంగరించారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో ఆరితేరిపోయిన కేసీఆర్ (KCR) కుటుంబం.. బాపు అనే అబద్ధాన్ని ప్రచారంలో పెట్టడానికి తెలంగాణలో పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పదేళ్లు తెలంగాణను రాజరిక వ్యవస్థలోకి తీసుకెళ్లి, నిర్లజ్జగా అవినీతికి పాల్పడి, దోచేసి, చివరికి ఓడిపోయిన కేసీఆర్‌ను చారిత్రాత్మక పురుషునిగా నిలబెట్టడానికి, తీర్చిదిద్దడానికి ఆయనకు బాపు టైటిల్ ఇచ్చి తెలంగాణ జాతిపితగా కీర్తిస్తూ ఆ టైటిల్‌ని క్రమంగా జనంలోకి తీసుకెళ్లడానికి కసరత్తు ప్రారంభించారు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ యోధులు.

అసలు కేసీఆర్‌ ఎవరికి బాపు ? ఎందుకు బాపు ? ఎవరి బాపు ? తెలంగాణకి కేసీఆర్ బాపు ఎలా అవుతాడు? ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్ని జనాన్ని వేధిస్తున్నాయి. అసలు తెలంగాణ జాతి కాదు. తెలంగాణ భారతదేశంలో ఒక ప్రాంతం. అభివృద్ధి పరంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ పుట్టిన వాళ్లు నివసించే వాళ్ళు తెలంగాణ వాసులు. వీళ్ళందర్నీ కేసీఆర్ కనలేదు. కేసీఆర్‌తో ఏ రకమైన రక్త సంబంధం లేదు. కానీ ఆయన మాత్రం తనను తాను బాపు అని ప్రకటించుకున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. కేసీఆర్‌ తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రదాత. అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ కోసం రాజకీయంగా పోరాడిన వాడు.

తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ఫలితంగా పదేళ్లపాటు అపరిమితమైన రాజకీయ అధికారాన్ని, సంపదని అనుభవించినవాడు కేసీఆర్. 10 సంవత్సరాలు పాటు తెలంగాణకు ఒక రాజు లాగే ఆయన బతికాడు. రాజరికం చేశాడు. ఆయన కుటుంబం ఒక రాజు కుటుంబం లాగే వెలగబెట్టింది. ఆ చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక రాజు లాగే కేసీఆర్‌ని కీర్తించారు. ఆ వైభవం అయిపోయింది. కేసీఆర్‌ కూతురు కవిత, కొడుకు కేటీ రామారావు, అల్లుడు హరీష్ రావు, బంధువు సంతోష్ రావు తో పాటు మిగిలిన వంది మాగదులంతా తెలంగాణను దోచుకు తిన్నారు. వేల ఎకరాల భూములను కబ్జా పెట్టారు. వేల కోట్లు సంపాదించుకున్నారు. రెండు గదులు ఇంట్లో ఉండే కవిత 200 కోట్ల విలువైన ఇంట్లోకి మారింది. సంపాదించిన వేలకోట్లు చాలక లిక్కర్ స్కాంకు పాల్పడింది. అన్నిటికంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే.. కేసీఆర్‌ బహిరంగంగా చెప్పాడు … బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయం కోసం ఏమైనా చేస్తాం ఎలాగైనా చేస్తాం అని ఆయనే ఆన్ రికార్డ్ మాట్లాడాడు.

ఎన్నికల్లో డబ్బులు పంచాడు, వేరే పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి ఆశ చూపి అన్ని రూల్స్‌ని తుంగలో తొక్కి తన పార్టీలో చేర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అడ్డగోలుగా దోచుకు తింటుంటే కల్లప్పగించి చూస్తూ ఉన్నాడు. అందుకే కేసీఆర్‌ను బాపు అని పిలవాలా? పదేళ్లు ఫ్యూడల్ వ్యవస్థలో జనాన్ని మగ్గపెట్టిన కేసీఆర్‌ కుటుంబం ఆయనకు ఇప్పుడు బాపు టైటిల్ ఇచ్చి ఇంకా ఫ్యూడల్ లాగే వ్యవహరిస్తున్నారు. నేతల్ని బిరుదులు, టైటిల్స్‌తో పిలిచే కాలం ఎప్పుడో పోయింది. జీవితంలో అన్నీ సంపాదించిన కేసీఆర్‌కి ఇప్పుడు ఆ కోరిక మిగిలిపోయినట్లుంది. తెలంగాణ బాపుగా తనని అభివర్ణిస్తూ వంది మాగదుల చేత ప్రకటన ఇప్పించుకున్నారు.

కేసీఆర్‌ కుటుంబం చేసిన ఆకృత్యాలు, అవినీతి, అరాచకాలు జనం ఇంకా మర్చిపోలేదు. అప్పుడే మర్చిపోరు కూడా. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఉద్యమ కాలంలో చేసిన వసూళ్లు.. తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక వసూలు చేసిన వేల కోట్ల రూపాయలు గురించి పైకి మాట్లాడకపోయినా అందరి మనసుల్లో ఉంది. అందుకే కేసీఆర్‌ ఎప్పటికీ తెలంగాణ బాపు కాలేడు. కేసీఆర్‌ తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్‌ ఒక్కడు మాత్రమే పోరాడలేదు. కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరూ చావలేదు. వందల మంది అమాయకులు తెలంగాణ కోసం బలయ్యారు. వాళ్ల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వాళ్ల సమాధులపై కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు సౌధాలు నిర్మించుకున్నారు. ఎంత ప్రచారం చేసినా, చరిత్రను చెరిపేయాలని ప్రయత్నించినా, భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చి టెక్స్ట్ బుక్స్ లో తెలంగాణ బాపు కేసీఆర్ అని రాయించు కున్న జనం హృదయంలో కేసీఆర్ బాపు కాలేడు. ఆయన తెలంగాణ జాతిపిత కానే కాదు. ఆయన పిల్లలకి మాత్రమే ఆయన బాపు. ఆయన కుటుంబానికి మాత్రమే ఆయన జాతిపిత.