KCR: కాంగ్రెస్ నేతలు తనను తిరగనివ్వమని అంటున్నారని, అంత మొనగాళ్లా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. దమ్ముంటే తమకన్నా కాంగ్రెస్ నేతలు గొప్పగా పాలించి చూపించాలని సవాల్ విసిరారు. మంగళవారం నల్గొండలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు. ఉద్యమ సభ, పోరాట సభ. దు జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
AP CAPITAL: వైసీపీ నేతల కొత్త కామెడీ.. ఏపీకి మూడు కాదు.. నాలుగు రాజధానులు కావాలట..
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేలా ఢిల్లీలో సంతకం పెట్టి వచ్చారు. తెలివిలేక కాంగ్రెసోళ్లు సంతకం పెట్టి వచ్చారు. నాలోంటళ్లను అడిగితే ఏం చేయాలో చెప్తాం కదా. నాలుగైదురోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలాడారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్ పక్కకు పెట్టి ప్రాజెక్టులపై చర్చ పెట్టారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రాజెక్టులను కాపాడుకున్నాం. కేంద్రం మమ్మల్ని ఎన్నిసార్లు బెదిరించినా వాటా తేల్చకుండా ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. రాష్ట్రపతి పాలన పెట్టైనా కూడా ప్రాజెక్టులను తీసుకుంటామని కేంద్రం చెప్పినా భయపడలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా కొట్లాడతాం. నేను పిలుపిస్తేనే భయపడి సభలో తీర్మానం పెట్టారు. ఇది చాలదు. అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకుపోండి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి వాటా తేల్చాకే ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు టైంబాండ్ పెట్టాలని డిమాండ్ చేయాలి. కావాలంటే ఐదేళ్లు అధికారంలో ఉండండి. మాకేం ఇబ్బంది లేదు. సాగునీటిపారుదల మంత్రిగా పని చేసినందునే మొన్న హరీశ్ రావు గట్టిగా సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంమీద అబాంఢాలు వేసి తప్పించుకు తిరుగుతామంటే కుదరదు. ప్రజల్లోనే తేల్చుకుందామని నల్గొండ సభకు పిలుపు ఇచ్చా. సభలో కాంగ్రెస్ వాళ్లు హడావుడిగా తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గాలేదు. దాంట్లో విద్యుత్ సంగతి లేనేలేదు.
కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్‌లు, 20 రిజర్వాయర్లు, 290 కి.మీ.టన్నెల్, 20 పంప్ హౌజ్‌లు, 1500 కి.మీ.కాల్వలు. కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ ఎందుకు వెళ్లారో చెప్పాలి. ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలిపోతే దానిని సరిచేయకుండా కేసీఆర్ మీద నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఒక్కటైనా మంచి పని చేస్తుందా? గట్టిగా మాట్లాడితే మీరు పెద్దోళ్లు అయిపోతరా? కేసీఆర్ సర్కారు పోగానే స్విచ్ తీసేసినట్లు కరెంటు పోతోంది. అసెంబ్లీలోనే జనరేటర్లు తెచ్చి పెడుతున్నరు. అలాంటిది ఏప్రిల్, మే నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తరా? చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుంది. కరెంటు కోసం అందరూ ఎక్కడికక్కడ నిలదీయండి. రైతు బంధు ఎందుకు వేయలేదంటే చెప్పుతో కొడతామంటున్నారు. రైతులకు మీకంటే మందంగా చెప్పులు ఉంటాయి. మేం ఈ ఛలో నల్గొండతోనే ఆపం. ఇలాంటి పోరాటం సాగుతూనే ఉంటుంది. మీరేం ఫికర్ కావొద్దు.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తది. ఇయ్యాల కొత్త దుకాణం మొదలుపెట్టిన్రు. పంటకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన బోనస్ రూ.500 ఇవ్వరట. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దతు ధర ఇవ్వలేదా? ధాన్యం కొనలేదా’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.