KCR Health : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు యశోదా హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గురువారం రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో కాలుజారి పడ్డారు కేసీఆర్. వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్ కు తరలించారు. కేసీఆర్ తుంటె ఫ్యాక్చర్ అయినట్టు యశోద డాక్టర్లు తెలిపారు. కాలుకు సర్జరీ చేయాల్సింది ఉందనీ… సాయంత్రం సర్జరీ చేయాలంటే కేసీఆర్ శరీరం పూర్తిగా సహకరించాలన్నారు డాక్టర్లు. ప్రస్తుతం 6 నుంచి 8 వారాలు రెస్ట్ అవసరమని తెలిపారు. అయితే బౌల్ రిప్లేస్‌మెంట్ చేసిన తరువాత మరుసటి రోజు నుంచే నడిపించడానికి అవకాశం ఉంటుందన్నారు డాక్టర్లు. కెసిఆర్ ఎడమ కాలు తుంటీ కి సర్జరీ అవసరం ఉంది.. మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యింది.. దాన్ని రీ ప్లేస్ చెయ్యాలా.. రిపేర్ చెయ్యాలా.. అనేదానిపై డాక్టర్స్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే కొన్ని పరీక్షలు నిర్వహించారు. సర్జికల్ ప్రొఫైల్ టెస్టులు పూర్తయ్యాయి. స్కానింగ్ తీశాం. CT కూడా తీస్తున్నామని డాక్టర్లు వివరించారు. కేసీఆర్ శరీరం సహకరిస్తే… సాయంత్రం నాలుగు గంటల తరువాత సర్జరీ నిర్వహిస్తామన్నారు యశోద డాక్టర్లు.
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెల్త్ సెక్రటరీని యశోద హాస్పిటల్ కు పంపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హాస్పిటల్ కు వెళ్ళారు ఆరోగ్యశాఖ కార్యదర్శి. డాక్టర్లను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు వైద్యాధికారులు. ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి వివరించారు యశోద డాక్టర్లు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ప్రభుత్వ వెంటనే స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో రాత్రి హాస్పిటల్ కు తరలించారు పోలీస్ అధికారులు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ x లో ట్వీట్ చేశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డాను… ఆయన త్వరగా కోలుకొని… మంచి ఆరోగ్యగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు మోడీ.
నాన్న త్వరలో పూర్తిగా కోలుకుంటారు… మీ అందరి ప్రేమకు కృతజ్ఞతల అని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. తుంటి భాగంలోని బౌల్ ను రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని వివరించారు. కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద హాస్పిటల్ కు క్యూకడుతున్నారు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లు. మాజీ మంత్రి హరీష్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ యశోదకు వచ్చారు. BRS నేత వినోద్ కుమార్, MLC వెంకట్ రామ్ రెడ్డి కూడా చేరుకున్నారు.