KCR IN SHOCK: కేసీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు గౌడ్‌లు జంప్‌..

రాజేంద్రనగర్‌ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 03:36 PM IST

KCR IN SHOCK: తెలంగాణలో బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఫస్ట్ ఝలక్ కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. గులాబీ పార్టీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. కారు పార్టీ ప్రతీ బలం మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పురపాలికల్లో పరిణామాలు ఇప్పటికే గులాబీ దళాన్ని టెన్షన్ పెడుతుంటే.. ఎన్నికలు అయ్యాక కూడా కంటిన్యూ అవుతున్న వలసలు ఆ గుబులును మరింత రెట్టింపు చేస్తున్నాయ్.

NANDAMURI BALAKRISHNA: ఇదేందయ్యా.. బాలయ్యా.. నోరు కంట్రోల్‌లో ఉండక్కర్లే..

రాజేంద్రనగర్‌ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రకాశ్‌ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్.. ఇప్పుడు మళ్లీ కండువా మార్చేస్తున్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో స్వామి గౌడ్‌ టిఫిన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ప్రకాశ్ గౌడ్ కూడా కనిపించారు. ప్రకాశ్ గౌడ్ విషయంలో క్లారిటీ లేకపోయినా.. కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి స్వామిగౌడ్ రెడీ అయ్యారని తెలుస్తోంది. టీఎన్జీవో నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్.. బీఆర్ఎస్‌తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాసన మండలి తొలి చైర్మన్‌గా ఆయనకు కీలక పదవి అప్పగించారు కేసీఆర్. 2020లో ఆయన బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. 2022లో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఇక అటు ప్రకాశ్‌ గౌడ్‌.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచాడు. ఐతే పొన్నం ప్రభాకర్‌.. తన సామాజికవర్గానికి చెందిన నేతలందరికీ గాలం వేస్తున్నారా అనే జోకులు పేలుతున్నాయ్. ఈ మధ్యే బీజేపీ నుంచి విక్రమ్‌ గౌడ్‌ను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు స్వామి గౌడ్‌, ప్రకాశ్‌ గౌడ్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారంతో.. పొన్నం ప్లాన్ అదుర్స్ అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయ్.