KCR: వచ్చే నెల వరకు తన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకొన్నట్లు చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. సోమవారం ఆయన తన ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16 వరకు మన ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకొన్నా. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం.
CONGRESS: కాంగ్రెస్‌లో అలజడి.. సీఎం పదవి కోసం సీనియర్ల మధ్య వాగ్వాదం!?
త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహిస్తాం. ఫలితాలపై సమీక్ష చేద్దాం. త్వరలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుందాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు గంగులు, మల్లారెడ్డి, పోచారం, దానం, తలసాని, వివేకానంద, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, పల్లా సహా ఎమ్మెల్సీలు హాజరయ్యారు.