KCR Election Campaign : కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం..

తెలంగాణ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కు ఎంతో సమయం లేదు. కేవలం ఒక్కట్టి అంటే ఒక్కరోజు మాత్రమే ఉంది. ప్రధాన పార్టీల నేతలు కళ్లలో ఒత్తులు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కు ఎంతో సమయం లేదు. కేవలం ఒక్కట్టి అంటే ఒక్కరోజు మాత్రమే ఉంది. ప్రధాన పార్టీల నేతలు కళ్లలో ఒత్తులు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ బీఆర్ఎస్ ఇంకాస్త ముందంజలో ఉంది. అందికన్న ముందు అభ్యర్థులను ప్రటించడం.. అందరితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి వివాదాలు లేకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవడంలో కేసీఆర్ ఓ మెట్టుపైనే ఉన్నారు. ఇక, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పార్టీ అగ్రనేతలను, మోదీ, అమిత్ షా లతో సహా కేంద్ర మంత్రులను.. రంగంలోకి దించి ప్రచారం చేస్తున్నాయి.

REVANTH REDDY: పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదాం: రేవంత్ రెడ్డి

అలాగే, నేడు సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కేసీఆర్ ఎన్నికల నోటీఫికేషన్ పడ్డపటి నుంచి ఇప్పటి వరకు 90 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఇక, నేడు ఆందోల్, సంగారెడ్డి, షాద్ నగర్, చేవెళ్ల, నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టి సభల్లో తో గులాబీ దళపతి పాల్గొన్న సభల సంఖ్య 94కు చేరుకోబోతుంది. రేపు మరో రెండు సభల్లో ఆయన పాల్గొంటారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతో పాటు గజ్వేల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ఎన్నికల ప్రచారం ముగించనున్నారు.