Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ పేరు.. హైకోర్టులో షాకిచ్చిన ఈడీ

దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం సంచలన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ పాత్రను ఢిల్లీ హైకోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ స్కాంకు సంబంధించిన అన్ని వివరాలు కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. గోపీ కుమరన్‌ ఇచ్చిన వాగ్మూలంలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఈడీ చెప్పింది.

దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం సంచలన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ పాత్రను ఢిల్లీ హైకోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ స్కాంకు సంబంధించిన అన్ని వివరాలు కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. గోపీ కుమరన్‌ ఇచ్చిన వాగ్మూలంలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఈడీ చెప్పింది. కవిత బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది ఈడీ. ఢిల్లీలోనే కేసీఆర్‌ అధికారిక నివాసంలోనే కవిత తన టీంను కేసీఆర్‌కు పరిచయం చేశారనేది ఈడీ వాదన. లిక్కర్‌ పాలసీ గురించి, రిటైల్‌ వ్యాపారం గురించి కేసీఆర్‌ కవిత టీం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్తోంది ఈడీ.

ఈ కేసులో వ్యవహారం మొత్తం కవితే నడిపిందని.. దీంతో కేసీఆర్‌కు ఎలాంటి సబంధం లేదని అంతా అనుకున్నారు. కానీ విషయం మొత్తం కేసీఆర్‌కు ముందే తెలుసంటూ ఈడీ ఇప్పుడు బాంబు పేల్చింది. ఇక మహిళ అనే కోణంలో కవిత బెయిల్‌ ఇవ్వకూడదంటూ ఈడీ వాదించింది. ఈ కేసులో ఉన్న ముద్దాయిల్లో తాను మాత్రమే మహిళనని.. ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్‌ పొందే అర్హత తనకు ఉందంటూ కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ కవితను ఓ సాధారణ మహిళగా పరిగనించకూడదని ఈడీ వాదిస్తోంది. కవిత బయటికి వస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్తోంది.

గతంలో కవిత దోషులను బెదిరించిన తీరు చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థమవుతోందంటూ ఈడీ చెప్పింది. అయితే కవిత లాయర్స్‌ మాత్రం ఆమె ఆధారాలు ధ్వసం చేసే అవకాశం లేదంటూ వాదించారు. కవిత వాడుకున్న ఫోన్లను తన దగ్గర పనిచేసేవాళ్లుకు ఇచ్చారని.. వాళ్లు వాటిని ఫార్మాట్‌ చేసి వాడుకున్నారని చెప్పారు. ఆ ఫోన్లనే ఈడీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఇందులో ఆధారాలు తారుమారు చేయడం గానీ ధ్వంసం చేయడం లాంటి ఉద్దేశం లేదంటూ చెప్పారు. ఇద్దరివైపు వాదనలు విన్న జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ.. తీర్పు ఈ నెల 30కి వాయిదా వేశారు.