KGF-3 : కేజీఎఫ్-3 చుట్టూ వంద అనుమానాలు..

కేజీఎఫ్-3 2025లో రిలీజ్‌ అవుతుందని హోంబలే ఫిల్మ్స్‌ అధికార ప్రతినిధి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ డేట్‌ ఇచ్చినప్పటి నుంచి అన్నీ అనుమానాలే. 2025లోగా ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ కాకుండా రెండు సినిమాలతో వస్తాడా? కెజిఎఫ్‌3 కంటే ముందే ఎన్టీఆర్‌ సినిమా వస్తుందా..? కేజీఎఫ్-3 వస్తుందా..?

కేజీఎఫ్-3 2025లో రిలీజ్‌ అవుతుందని హోంబలే ఫిల్మ్స్‌ అధికార ప్రతినిధి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ డేట్‌ ఇచ్చినప్పటి నుంచి అన్నీ అనుమానాలే. 2025లోగా ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ కాకుండా రెండు సినిమాలతో వస్తాడా? కెజిఎఫ్‌3 కంటే ముందే ఎన్టీఆర్‌ సినిమా వస్తుందా? కేజీఎఫ్-3 రిలీజ్‌ చాలా డౌట్స్ కి తెర లేపింది. సలార్‌ డిసెంబర్‌22న రిలీజ్‌ అవుతోంది. ఈ ఏడాది వరకు సలార్‌తోనే గడిపేస్తాడు దర్శకుడు. వచ్చే రెండేళ్లల్లో రెండు సినిమాలు రిలీజ్‌ చేయగలడా? ఒక్కో సినిమాలకు రెండేళ్లు తీసుకునే ప్రశాంత్‌నీల్‌కు ఇది సాధ్యమేనా? కథెప్పుడు రాసుకుంటాడు ? ఎప్పుడు తీస్తాడు? వచ్చే  డిసెంబర్‌ 21 నాటికి కేజీఎఫ్ విడుదలై ఐదేళ్ళవుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇదే చర్చ. సందర్భంగా కేజీఎఫ్-3 కు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వనుంది. ఈలోగా 2025లో కేజీఎఫ్-3 రిలీజ్‌ అంటూ హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించడం షాక్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌ తో సినిమాను మేలో మొదలుపెడతామని ప్రశాంత్‌ నీల్‌ రీసెంట్‌గా చెప్పాడు. ఎంత స్పీడ్‌గా తీసినా.. 2025 సమ్మర్‌నాటికి రిలీజ్‌కు రెడీ చేస్తాడు. కేజీఎఫ్-3 ను 2025లో రిలీజ్‌ చేస్తారనుకున్నా.. ఆరు నెల్లలో షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమే. ఎప్పుడో రావాల్సిన సలార్‌ అదిగో ఇదిగో అంటూ.. డిసెంబర్‌22కు వెళ్లిపోయింది. హైప్‌ క్రియేట్‌ చేయడానికి ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తున్నారేగానీ.. అది సాధ్యమా? కాదా అని ఆలోచించడం లేదు. పెద్ద సినిమాల షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో డైరెక్టర్‌కే తెలీదు. అలాంటప్పుడు హోంబలే ఫిల్మ్స్‌ కేజీఎఫ్-3 2025 రిలీజ్‌ అంటూ అనౌన్స్‌ చేసినా.. ప్రశాంత్‌ నీల్‌ వల్ల అయితే మాత్రం కాదు.