కివీస్ పేసర్ సంచలన నిర్ణయం, టెస్ట్ క్రికెట్ కు సౌథీ గుడ్ బై

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పబోతున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగే సిరీస్ తో టెస్ట్ కెరీర్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ప్రకటించాడు.

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 09:07 PM IST

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పబోతున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగే సిరీస్ తో టెస్ట్ కెరీర్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ప్రకటించాడు. 35 ఏళ్ళ సౌథీ 2008లో ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఒక‌వేళ కివీస్‌ ఐసీసీ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొన‌సాగ‌నున్న‌ట్లు సౌథీ చెప్పాడు. న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం తనకు దక్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నట్టు తెలిపాడు.
18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ విజయాల కోసం తనవంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉందన్నాడు. సౌథీ 104 టెస్టుల్లో 385 వికెట్లు పడగొట్టాడు.