ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్‌లో కొడాలి నాని ఒకరు. ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో.. చంద్రబాబుపై నిప్పులు చెరగడంలో కొడాలి నాని స్టైలే వేరు. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో కనిపించే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన ఇంట్లో వైసీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో కొడాలి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్యకర్తలు ఆయనను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
దీంతో కొడాలికి ఏమయ్యింది అని ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. చాలా కాలం నుంచి కొడాలి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కొడాలి కేన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం దానికి ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారని ఓ వర్గం వాదిస్తోంది. ఆ మధ్య హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ దగ్గర కొడాలి కనిపించడం కూడా అప్పట్లో ఓ పెద్ద చర్చకు దారి తీసింది. కేవలం ఇది మాత్రమే కాకుండా కొడాలికి చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనేది చాలా మంది చెప్తున్న మాట. కొంతమంది ఐతే వచ్చే ఈ ఎన్నికల్లో కొడాలి పోటీ కూడా చేయరని చెప్పారు. కానీ నాని మాత్రం పోటీ చేశారు.
ఆయన ఆరోగ్యం గురించ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొడాలి ఇలా కుప్పకూలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే డాక్టర్లు మాత్రం ప్రస్తుతం నాని ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. వడదెబ్బ తగిలిన కారణంగానే నాని కళ్లుతిరిగి పడిపోయాడని చెప్తున్నారు. మొన్నటి వరకూ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం.. ఇప్పుడు రెస్ట్ లేకుండా కార్యకర్తలతో మీటింగ్స్ నిర్వహించడంతో నాని వీక్ ఐనట్టు చెప్తున్నారు. దానికి తోడు రెండు రోజుల నుంచి తీవ్రంగా ఎండలు పెరిగిపోవడంతో ఆయన కళ్లుతిరిగి పడిపోయాడని చెప్తున్నారు. 24 గంటల్లో నానిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా నాని ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలు ఆగుతాయా లేదా చూడాలి.