KODI KATHI SRINU: జైల్లోనే డిగ్రీ పూర్తి చేసిన కోడి కత్తి శ్రీను..

కోడి కత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌.. విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 05:00 PM IST

KODI KATHI SRINU: స్టూడెంట్‌ నంబర్‌ వన్ అని ఓ సినిమా గుర్తుంది కదా. సెంట్రల్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తూ.. తండ్రి కల కోసం హీరో ‘లా’ చేస్తాడు. అనుకున్నది సాధిస్తాడు. జైల్లో ఉంటూ అలా చదువుకోవడం సాధ్యం కాదేమో కానీ.. చదువుకోవడం, డిగ్రీ పూర్తి చేయడం సాధ్యమే! ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. కోడి కత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌.. విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.

JANASENA: జనసేన బలం ఎక్కడ ? ఏం చూసుకొని పవన్ సీట్లు అడుగుతున్నట్టు ?

అంబేద్కర్‌ ఫొటో చేతుల్లో పట్టుకొని జైలు గేట్ దాటాడు శ్రీనివాస్‌. ఐతే జైల్లోనే శ్రీను డిగ్రీ పూర్తి చేశాడు. రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడే అంబేద్కర్ వర్సిటీ దూరవిద్యలో 70 శాతం మార్కులతో.. శ్రీను బీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత శ్రీనును రాజమహేంద్రవరం జైలునుంచి విశాఖ జైలుకు తరలించారు. ఇక అటు శ్రీనుకు కండిషన్డ్ బెయిల్ ఇచ్చింది కోర్టు. పూచీకత్తుతో పాటు.. ప్రతీ ఆదివారం పీఎస్‌లో సంతకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి. ఇక శ్రీను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా కనిపించాడు. సాధారణంగా రిమాండ్‌ ఖైదీలు వారి దుస్తుల బ్యాగుతో బయటకు వస్తుంటారు. ఐతే శ్రీనివాస్‌ మాత్రం అంబేద్కర్ ఫోటోను గుండెలపై పెట్టుకొని బయటకొచ్చారు. శ్రీనివాస్‌పై ఇకపై ఎటువంటి కుట్రలు జరగకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేస్తామని అన్నారు.

కొడుకును చూసి శ్రీను తండ్రి తాతారావు కన్నీటి పర్యంతం అయ్యారు. ఐదేళ్ల తర్వాత కొడుకు బయటకు రావడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా ఎలా ఉన్నా.. జైల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతానికి కోడికత్తి కేసులో శ్రీను నిందితుడు మాత్రమే. తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులు చూసుకుంటాయ్. ఐతే రిమాండ్‌లో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా.. డిగ్రీ చేయాలన్న ఆలోచన రావడం చాలామంచిది అంటూ శ్రీనును అభినందిస్తున్నారు కొందరు.