సంక్రాంతి (Sankranti) ఈ పండుగ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State). అందులో ముఖ్యంగా కోడి పందాలు (kodi Pandalu). సంక్రాంతి పండుగకు ( Sankranti Festival) చాలా మంది ప్రజలు ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లి అక్కడ కూటుంబ సభ్యులతో పండుగ జరుపుకుంటారు. కాగా ఏపీలో జరుగుతున్న కోడి పందాలు చూడటానికి.. ఆడటానికి భారీగానే క్యూ కడుతున్నారు.
కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ ఉదయం నుంచే పందెం రాయుళ్లు బరి లోకి దిగారు. బరిలో దింపేందుకు కోళ్లను బరుల వద్దకు తెచ్చిన పందెం రాయుళ్లు.. తన ప్రత్యర్థి కోడి ని ఓడించేందుకు మరొక కోడితో కోడి కంటి చూపులతో ఒకదానికొకటి దాన్ని ఊసకోళ్లుతారు. కోడి చూపుల తర్వాత పందాలకు బెట్టింగ్ రాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తారు. కోడి పందాల కోసం ఉదయం నుంచే పందెం బరుల వద్ద లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మరొక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన సంక్రాంతి కోడి పందాలు ఈ ఒక్కరోజు 100 కోట్లు చేతులు మారే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమైవుతుంది. కానీ కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు.. క్రికెట్ స్టేడియాన్ని తలపిస్తున్నాయి. కోడి పందాల్లో ఆడేందుకు నోట్ల కట్టలతో బరుల వద్ద పందెం రాయుళ్లు వాలిపోయారు. దీంతో ఉదయం నుంచి బరిల వద్దకు పెద్ద ఎత్తున జనం పోటెత్తుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మాత్రం రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 250 బరుల్లో తొలిరోజు 50 కోట్ల పైగా జరిగిన పందాలు జరిగాయి.
కోడిపందాలు ముసుగులో భారీగా జరుగుతున్న గుండాట్లు గాంబ్లింగ్ గేమ్స్, కాయ్ రాజా కాయ్ వంటి ఆటలు ఆడేందుకు లక్షల రూపాయలు వరకు పందాలు జరుగుతున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారబోతున్నాయి.