బ్యాట్ కు తాకినా ఎల్బీడబ్ల్యూ రివ్యూ అడగని కోహ్లీ

ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ గా , రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీకి 2024 మాత్రం పెద్దగా కలిసి రావడం లేదు. ఈ ఏడాది విరాట్ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. కీలక మ్యాచ్ లలో తడబడుతూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - September 20, 2024 / 06:33 PM IST

ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ గా , రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీకి 2024 మాత్రం పెద్దగా కలిసి రావడం లేదు. ఈ ఏడాది విరాట్ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. కీలక మ్యాచ్ లలో తడబడుతూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 23 పరుగులే చేయగలిగాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో విరాట్ ఔట్ ఆశ్చర్యపరిచింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన విరాట్ రివ్యూ కోరలేదు. బంతి ప్యాడ్లను తాకకముందే బ్యాట్ కు తగిలినా అంపైర్ ఔటివ్వడం, కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్ళిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న కోహ్లీ ఇలా రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోవడం ఫ్యాన్స్ కు ఒకవిధంగా షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే గత 14 నెలల్లో కోహ్లీ 3 టెస్టులే ఆడాడు. ఏడాదిగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 20023 జూలైలో విండీస్ పై చేసిన టెస్ట్ శతకమే కోహ్లీకి చివరిది. అటు వన్డేల్లో కూడా కోహ్లీ శతకం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సొంతగడ్డపై బంగ్లాతో సిరీస్ విరాట్ కు మంచి అవకాశం. ఎందుకంటే కివీస్ తో సిరీస్ తర్వాత ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సవాల్ ను కాన్ఫిడెంట్ గా ఎదుర్కొవాలంటే మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోవాల్సిందే. మరి రెండో టెస్టులోనైనా రన్ మెషీన్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.