ఎవడు భయ్యా వీడు.. కోహ్లీనే కంగారుపెట్టాడు

భారత్,బంగ్లాదేశ్ తొలి టెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 9 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - September 17, 2024 / 04:37 PM IST

భారత్,బంగ్లాదేశ్ తొలి టెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 9 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు. రానున్న ఐదు నెలలు భారత్ ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లే ఆడబోతున్న నేపథ్యంలో కోహ్లీ ఫోకస్ పెంచాడు. అయితే నెట్స్ లో కోహ్లీని ఓ యువ బౌలర్లు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 6.5 అడుగుల గుర్నూర్ బ్రార్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు కోహ్లీ కాస్త ఇబ్బందిపడ్డాడు. అతను వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను సరిగ్గా ఫేస్ చేయలేకపోయాడని తెలుస్తోంది. బంగ్లా బౌలర్ నహీద్ రాణా పేస్ ఎటాక్ ను దృష్టిలో ఉంచుకుని గుర్నూర్ ను బీసీసీఐ భారత నెట్ బౌలర్ గా ఎంపిక చేసింది. అయితే అతని బౌలింగ్ లోనే విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫూట్‌లో ఆడబోయి విఫలమయ్యాడు.

దీంతో కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఈ బౌలర్ ఎవరా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తెగ శోదిస్తున్నారు. నిజానికి దేశవాళీ క్రికెట్‌లో గుర్నూర్ బ్రార్‌కు గొప్ప గణంకాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు ఐదు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబ్ బౌలర్ 7 వికెట్లు తీసాడు. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చాడు. అయితే ఆరడుగుల కంటే ఎక్కువ హైట్ తో ఉన్న గుర్నూర్ మరింత రాటుదేలితే భవిష్యత్తులో మంచి పేసర్ గా ఎదిగే అవకాశముంటుందని భావిస్తున్నారు.