KKR TDP : ఫైనల్లో కోల్ కతా గెలిచింది… ఏపీలో ఆ పార్టీదే అధికారం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ హైదరాబా‌ద్ ను అవలీలగా ఓడించి కప్పు గెలుచుకుంది kkr. అయితే ఐపీఎల్ లో కేకేఆర్ గెలుపునకు… ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మధ్య పోలికపెడుతున్నారు కొంతమంది నెటిజెన్లు. దానికీ దీనికి పోలికేంటి బ్రదర్ అని కొందరు అడుగుతుండగా… సోషల్ మీడియాలో ఈ వార్ తీవ్ర స్థాయికి చేరింది.

2014లో ఐపీఎల్ (IPL) లో… ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏం సంఘటనలు జరిగాయో… 2024లోనే అవే జరుగుతాయని కొత్త వాదన బయల్దేరింది. కోల్ కతా విజయానికి, ఏపీలో ఎన్నికలకు ముడిపెట్టారు కొందరు. 2014 ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా కింగ్స్ ఎలెవన్… పంజాబ్ జట్టుపై విజయం సాధించింది కప్పు గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP) గెలిచి అధికారంలోకి వచ్చింది.

2014లో జరిగిన సంఘటనలే ఇప్పుడు కూడా రిపీట్ అవుతాయని అంటున్నారు. మళ్ళీ కోల్ కతా గెలిచింది కదా… టీడీపీ కూడా గెలిచి అధికారలోకి వస్తుందని కొందరు నెటిజన్ల టాక్. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఏపీలో టీడీపీతోనేకాదు… కేంద్రంలో బీజేపీతోనూ లింక్ పెడుతున్నారు కొందరు. 2014లో బీజేపీ గెలిచింది… 2024లోనూ ఆ పార్టీదే అధికారం అంటున్నారు. టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య ట్విట్టర్ లో విచిత్రమైన యుద్దం జరుగుతోంది. అసలు ఎన్నికలకీ… క్రికెట్ కి పోలిక ఏంటిరా బాబు… అని విమర్శలు చేసేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు.