Barrelakka: బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ఈపేరు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఊపేస్తోంది. నిరుద్యోగుల గొంతుకను అవుతానని.. అసెంబ్లీ బరిలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషకు.. ప్రపంచవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోంది. యూఎస్ నుంచి ఆమె ప్రచారం కోసం విరాళాలు అందుతున్నాయ్ అంటే అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు బర్రెలక్క రేంజ్ ఏంటి అని ! కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి బర్రెలక్క పోటీ చేస్తోంది. ఐతే ఈ మధ్య ప్రచారంలో పాల్గొన్న ఆమె మీద.. కొందరు దాడి చేశారు.
Priyanka Gandhi Vadra: బీఆర్‌ఎస్‌ను చూసేది మ్యూజియంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ
శిరీష్ తమ్ముడిని తీవ్రంగా కొట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారడంతో.. హైకోర్టు వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో బర్రెలక్కకు భద్రత కల్పించాలని.. ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఐతే కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీ.. ఆమెపై దాడి అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దాడి చేసింది కాంగ్రెస్‌కు చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత బర్రెలక్కకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైన అయినా పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని.. బర్రెలక్క పోటీ చేయడం ద్వారా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని హర్షవర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పించమని తాను కూడా అధికారులను కోరినట్లు వివరించారు.
బర్రెలక్క తరఫున హైకోర్టుకు వెళ్లిన లాయర్ తన స్నేహితుడే అని అన్నారు. హైకోర్టు బర్రెలక్కకు భద్రత కల్పించడం సంతోషకరం అన్న ఆయన.. కొల్లాపూర్‌లో తన గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు హర్షవర్దన్ రెడ్డి. బర్రెలక్క ఓడిపోతే ఉద్యోగం ఇప్పిస్తానని భరోసానిచ్చారు.