మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు.. నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ సంచియాలయంలో మంత్రిగా భాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం డా. బిఆర్ అబ్కెందక్కర్ తెలంగాణ సచివాలయంలో 5వ అంతస్తులోని 11 రూమ్ తన కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి పదవీ భాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా భాద్యతలు స్వీకరించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ మరుసటి రోజు తన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత బుధవారం అసెంబ్లీలో పలువురు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. 119 స్థానాలకు గానూ 64 స్థానాల్లో హస్తం హావా స్పష్టంగ కనిపించింది. తెలంగాణ మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసింది. తెలంగాణలో ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మందికి చోటు దక్కనుంది. ఇప్పటికే సీఎంతో సహా 12 మంత్రులుగా ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు వరించనున్నాయి.