HARISH RAO VS KOMATIREDDY: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరుగుతున్న చర్చలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేసిందని.. అలాంటిది ఇప్పుడు నల్గొండలో సభ ఎలా పెట్టుకుంటారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సభ అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు.
Qatar: ఫలించిన భారత దౌత్యం.. ఖతార్‌లో భారతీయులకు మరణశిక్ష రద్దు.. భారత్ రాక..
జనాలు ఎవరూ బీఅర్‌ఎస్‌ను అంత త్వరగా నమ్మరని.. నల్గొండలోనే అది ప్రూవ్ అవుతుంది అంటూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్‌రావుకు గులాబీ పార్టీలో భవిష్యత్ లేదని.. బీఆర్ఎస్ నుంచి 26మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లో చేరితే.. ఆయనకు దేవాదాయశాఖ మంత్రి పదవి ఇస్తామంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ చేస్తున్నాయ్. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీష్ రావును దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే హరీష్ రావు కష్టజీవి అని.. అదే పార్టీలో ఉంటే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదంటూ సెటైర్లు వేశారు. గతంలో తమ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలను వాళ్లు తీసుకోలేదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
ఇక అటు హరీశ్, కడియంలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని.. పదవుల కోసం పాకులాడే వాళ్లం అసలే కాదంటూ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర తమదని గుర్తు చేసిన ఆయన.. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలంటూ సూచించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ అసెంబ్లీ లాబీల్లో చేసిన ఈ కామెంట్స్.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై కారు పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.