హీరోయిన్ల కాపురాలతో కేటిఆర్: కొండా సురేఖ సంచలన కామెంట్స్

కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బాపూ ఘాట్ లో మాట్లాడిన కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 01:34 PM IST

కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బాపూ ఘాట్ లో మాట్లాడిన కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారు అనుకుంటున్నారు అని మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్ కు చెప్పినట్లు ఉన్నారు ఎస్టీ మహిళా సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు అని మండిపడ్డారు. బీసీ మహిళనైన తన పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు.

ఐదేళ్లు భారాసలో పని చేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసన్నారు. ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశాన్ని స్వాగతిస్తున్నాను… కేటీఆర్ కు కూడా తల్లి అక్క, చెల్లెలు లేరా అని నిలదీశారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్లపై ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయి అని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు అని హితవు పలికారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు.