కొనేది 204 ప్లేయర్స్ నే, మెగా వేలం షార్ట్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతోంది. తాజాగా దీనికి సంబంధించి బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలంలోకి రానున్నట్టు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 07:48 PM IST

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతోంది. తాజాగా దీనికి సంబంధించి బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలంలోకి రానున్నట్టు వెల్లడించింది. అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వీలంలోకి 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా అందులో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు. వీళ్లలో 70 మంది విదేశీ ప్లేయర్సే వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో 318 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 12 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ ను కూడా షార్ట్ లిస్ట్ చేశారు.

మెగా వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ అత్యధికం కాగా.. ఇందులో 81 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇక కోటిన్నర బేస్ ప్రైస్ తో 27 మంది, కోటీ 25 లక్షల బేస్ ప్రైస్ తో 18 మంది, కోటి బేస్ ప్రైస్ లో 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. 425 మంది ప్లేయర్స్ కోటి బేస్ ప్రైస్ కంటే దిగువన ఉంటారు. మెగా వేలంలో మొదటగా వచ్చే ప్లేయర్స్ జాబితాను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. మర్కీ సెట్ 1 ప్లేయర్స్ లిస్టులో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. మర్కీ సెట్ 2 ప్లేయర్స్ లో యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఇక సెట్ 1 ఆల్ రౌండర్స్ లో అశ్విన్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్ చోటు దక్కించుకున్నారు. ఈ వేలానికి రహానే రాగా.. పుజారాకు మాత్రం చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఊహించినట్టుగానే పలువురు కెప్టెన్లు వేలంలోకి వచ్చేశారు. అటు ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్లకు పెంచారు. రిటెన్షన్ ప్లేయర్స్ కు వెచ్చించిన మొత్తం పోను మిగిలిన డబ్బులతో ఫ్రాంఛైజీలు మరో 20 నుంచి 25 ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఈసారి అన్ని ఫ్రాంచైజీల కంటే పంజాబ్ కింగ్స్ వ‌ద్ద అత్య‌ధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. దాంతో, ఆ ఫ్రాంచైజీ రికార్డు ధ‌ర‌కు స్టార్ ఆట‌గాళ్ల‌ను సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.