Krish Jagarlamudi: ఇంకా ఎవరున్నారు..? డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు

క్రిష్ మాత్రం.. తాను హోటల్‌కి ఫ్రెండ్స్‌ని కలవడానికి మాత్రమే వెళ్ళానంటున్నారు. అరగంటలో డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిపారు. హైదరాబాద్‌ రాడిసన్ డ్రగ్స్ పార్టీలో FIR ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 03:28 PM IST

Krish Jagarlamudi: రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పేరు కూడా యాడ్ అయింది. ఆయన్ని 8వ నిందితుడిగా చేర్చారు గచ్చిబౌలీ పోలీసులు. పెడ్లర్‌ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్‌ పేరు ప్రస్తావించినట్లు తెలిపారు. పార్టీ జరిగే టైమ్ లో అరగంట పాటు వివేకానందతో.. రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. క్రిష్ మాత్రం.. తాను హోటల్‌కి ఫ్రెండ్స్‌ని కలవడానికి మాత్రమే వెళ్ళానంటున్నారు. అరగంటలో డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిపారు.

young voters in India: యువ ఓటర్ల హవా.. పెరిగిన యంగ్ ఓటర్ల శాతం.. దేశంలో మొత్తం ఓట్లు ఎన్నంటే..

హైదరాబాద్‌ రాడిసన్ డ్రగ్స్ పార్టీలో FIR ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు. ఫ్రెండ్స్‌తో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద ఇప్పటికే ఒప్పుకున్నారు. నిర్భయ్‌, రఘుచరణ్‌, కేదార్‌, సందీప్‌, శ్వేత, లిశి, నీల్‌తో కలిసి వివేకానంద డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. సయ్యద్ అబ్బాస్‌ జఫ్రీ దగ్గర డ్రగ్స్‌ కొన్నట్టు పోలీస్‌ విచారణలో వివేకానంద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో 8వ నిందితుడికి డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చడం సంచలనంగా మారింది. వివేకానందతో క్రిష్ అరగంట సేపు ఆ రూమ్ లో గడిపి.. ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు కన్ఫామ్ చేయాల్సి ఉంది. అయితే తనను పోలీసులు ఎంక్వైరీ చేశారనీ.. ఓ ఫ్రెండ్ కోసం రాడిసన్ హోటల్ కి వెళ్ళానని అంటున్నారు క్రిష్.

సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు హోటల్ నుంచి బయటకు వచ్చేశానన్నారు. వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందన్నారు. తన డ్రైవర్ లేకపోవడంతో ఆయనతో అరగంట సేపు మాట్లాడాననీ.. డ్రైవర్ రాగానే పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. దీనిపై పోలీసులకు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చినట్టు క్రిష్ తెలిపారు. ఈ డ్రగ్స్‌తో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు క్రిష్. డ్రగ్స్ కేసులో కొందరు సినీ ప్రముఖులు ఉన్నట్టు తెలియడంతో.. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఆ రోజు హోటల్ సెల్లార్ పార్కింగ్ నుంచి కారులో నిందితులు పారిపోయారని వాళ్ళకి హోటల్ సిబ్బంది ఏమైనా సహకరించారా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.