Face Book Love Story: నిన్న సీమా.. ఇవాళ కృష్ణ మండల్‌.. ఇవెక్కడి ప్రేమ కథలు బాబోయ్‌..

పబ్‌జీ పరిచయం అయి.. ఫ్యామిలీని, భర్తను వదిలేసి మరీ ఇండియాకు అక్రమంగా వచ్చి.. నచ్చినోడిని పెళ్లిచేసుకున్న సీమా హైదర్ కథ గురించి దేశం అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. అలాంటి ప్రేమకథే ఇంకోటి వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 04:09 PM IST

ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ప్రేమికుడి కోసం అడవులు దాటి, వరదలు దాటి, నదులు ఈది ఇండియాకు చేరుకుంది మరో యువతి. కాకపోతే ఈమె వచ్చింది బంగ్లాదేశ్‌ నుంచి! ఫేస్‌బుక్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన ఆభిక్‌తో కృష్ణకు స్నేహం ఏర్పడింది. పాస్‌పోర్టు లేకపోవడంతో.. బంగ్లాదేశ్‌ నుంచి రహస్యంగా భారత్‌ చేరుకుంది. ప్రియుడిని కలిసి పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ గుడ్డిది అంటారు కదా.. కృష్ణ మండల్‌ ప్రేమ కథ చూస్తే నిజమే అనిపిస్తుంది. బంగ్లాదేశ్‌ నుంచి ఇండియాకు వచ్చే ప్రాసెస్‌లో ఆమెకు ఏమీ కనిపించలేదు. ఏదీ ప్రమాదం అనిపించలేదు. దారిలో దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు లాంటి ఆటంటకాలు ఎదురైనా.. ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయ్‌. వాటిని దాటుకుని తన ప్రియుడిని మనువాడేందుకు భారత్‌ వచ్చింది కృష్ణ మండల్‌.

ప్రేమలో నిండా మునిగిన ఆమెకు.. పులులు సంచరించే దట్టమైన అటవీప్రాంతంగా పేరొందిన సుందరవనాలను దాటింది. అడవుల్లోని నదులను ఈదుకుంటూ వచ్చి భారత్‌ చేరుకుంది. ఈ క్రమంలో చాలాసార్లు దారి తప్పిపోయింది కూడా. పాస్‌పోర్టు లేనందున జనాల కంటపడకుండా రహస్యంగా పశ్చిమబెంగాల్‌ చేరుకుంది. అక్కడ అభిక్‌ను కలుసుకుంది. పెళ్లి చేసుకుంది. ఇక్కడే ఈ జంటకు ఆటకం ఎదురైంది. కృష్ణ అక్రమంగా భారత్‌లోకి చొరబడిందంటూ పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. తన దగ్గర ఎటువంటి పాస్‌పోర్ట్ లేదని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించారు.