JOB CALENDAR: నమ్మొచ్చా..? మళ్ళీ గెలిస్తే జాబ్ కేలండర్.. ఓట్ల కోసం కేటీఆర్ కొత్త ముచ్చట..

డిసెంబర్ 4 తర్వాత TSPSCని ప్రక్షాళన చేస్తామని ఆ మధ్య ఓ సభలో హామీ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న నాడు 10 గంటలకు అశోక్ నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగార్థులతో మీటింగ్ పెడతానని అంటున్నారు. మళ్ళీ సర్కార్ వచ్చాక వీలైనంత త్వరలో జాబ్ కేలండర్ ఇస్తామంటున్నారు.

  • Written By:
  • Publish Date - November 21, 2023 / 03:59 PM IST

JOB CALENDAR: మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక జాబ్ కేలండర్ ఇస్తారట. అదికూడా.. వీలైనంత త్వరలోనే ఇస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పీకల్లోతు కోపంగా ఉన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వేయలేదు. వేసినా.. TSPSC నుంచి లీకులు, వాయిదాలు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసింది కేసీఆర్ సర్కార్. బీజేపీ, కాంగ్రెస్ 2 లక్షలకు పైగా కొలువులు భర్తీ చేస్తామంటే.. 2023 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీ ప్రస్తావనే లేదు.

KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగుల ఓట్లు కూడా కీలకమని భావిస్తోంది కారు పార్టీ. అందుకే వాళ్ళకు ఉన్నట్లుండి వరాల జల్లు కురిపిస్తున్నారు మంత్రి కేటీఆర్. నిధులు, నీళ్ళు, నియామకాల కోసమే ఏర్పడింది తెలంగాణ. రాష్ట్రం వస్తే మా కొలువులు మాకే అని ఆశపడ్డారు నిరుద్యోగులు. కానీ ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. జాబ్ కేలండర్ వేస్తామనీ, నిరుద్యోగ భృతి ఇస్తామనీ చేసిన వాగ్దానాలు గాల్లో కలిశాయి. పైగా TSPSC లీకులు, పేపర్లు అమ్ముకోవడం, వాయిదాల మీద వాయిదాలతో.. ప్రభుత్వం పరువు పోయింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో BRSను ఓడించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు నిరుద్యోగులు. ప్రస్తుతం కాంగ్రెస్ వేవ్ వీస్తుండటం.. ఆ పార్టీతో పాటు బీజేపీ కూడా 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీపై హామీలు ఇవ్వడం బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారాయి. కాంగ్రెస్ అయితే తాము అధికారంలోకి వస్తే 2024లో TSPSC గ్రూప్స్ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తామో డేట్స్ కూడా ప్రకటించింది.

బీజేపీయేమో UPSC తరహాలో జాబ్ కేలండర్, కొలువులు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో ప్రస్తుతమున్న ముక్కోణపు పోటీ పరిస్థితుల్లో ప్రతి వర్గం ఓట్లూ కీలకమని భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే నిరుద్యోగుల కోసం ఒక్కో వరం ప్రకటిస్తున్నారు మంత్రి కేటీఆర్. డిసెంబర్ 4 తర్వాత TSPSCని ప్రక్షాళన చేస్తామని ఆ మధ్య ఓ సభలో హామీ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న నాడు 10 గంటలకు అశోక్ నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగార్థులతో మీటింగ్ పెడతానని అంటున్నారు. మళ్ళీ సర్కార్ వచ్చాక వీలైనంత త్వరలో జాబ్ కేలండర్ ఇస్తామంటున్నారు. ఇప్పటికే లక్షా 62 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అయితే గతంలోకూడా ఎన్నికల ముందు జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి అని చెప్పిన BRS సర్కార్.. ఆ తర్వాత వాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఉద్యోగులు భర్తీ చేస్తుందన్న నమ్మకం ఏంటని నిరుద్యోగులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. రెండు రూపాయలకు కేజీ పేడ కొనుగోలు..

ఓట్లు వేయించుకునే వరకే కేటీఆర్ ముచ్చట.. ఆ తర్వాత పట్టించుకోరని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన సీఎం కేసీఆర్ కూడా నిరుద్యోగుల విషయంలో ఒక్క ప్రకటనా చేయలేదంటున్నారు. TSPSC పేపర్ల లీకేజీపైనా మాట్లాడని సీఎంని ఎలా నమ్మాలని యూత్ ప్రశ్నిస్తున్నారు.