KTR: బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్ మాత్రమే.. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు: కేటీఆర్

బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉంది. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు..? పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదు కానీ రైతు బంధు ఇస్తే తప్పా..? రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌.

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 02:39 PM IST

KTR: బీజేపీని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని, ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం, దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేశారు. “వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి. ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం, దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం సరికాదు.

Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

బీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయి. బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉంది. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు..? పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదు కానీ రైతు బంధు ఇస్తే తప్పా..? రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌. ఆ పథకం కొత్తది కాదు. ఇప్పటికే కొనసాగుతున్న పథకానికి ఎన్నికల కోడ్‌ వర్తించబోదు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరు. రాహుల్‌ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నా. ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది అట్టర్‌ ప్లాప్‌ ప్రభుత్వం. కాలం చెల్లిన కాంగ్రెస్‌ ఎంతవాగినా లాభం ఉండబోదు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు.

కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు. గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్ల స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. గోషామహల్‌ సహా ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఓడిస్తాం. తెలంగాణ జాతిని ఏకం చేసిన రోజు నవంబర్‌ 29. పద్నాలుగు సంవత్సరాలుగా నవంబర్‌ 29న దీక్షా దివాస్‌ జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా దీక్షా దివస్‌ను నిర్వహిస్తాం. దీక్షా దివస్‌లో తెలంగాణ ప్రజలంతా పాల్గొనాలి” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.