KTR: ఎం రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం ఆయన చేవెళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏమైంది..? లక్ష రూపాయలు, తులం బంగారం ఎక్కడ పాయే..? కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక పోతున్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. కాంగ్రెస్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఎవరు అధైర్య పడొద్దు. కారు సర్వీసింగ్‌కు పోయింది. మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తుంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్నం. ప్రజల తరపున ప్రశ్నిస్తాం. 119 సీట్లలో 39 సీట్లు బలమైన ప్రతిపక్షంగా ఉన్నం. 14 సీట్లలో ఐదు వేల ఓట్లలోపే ఓటమి పాలైనం. అందులో సగం గెలిచినా వేరే విధంగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్‌లు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలు కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తోంది. మార్పు కావాలి అన్నోళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నరు. హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను బట్టలిప్పి చేవెళ్ల చౌరస్తాలో నిలబెడదాం. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలే. కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లో రైతు బంధు పడేది. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి అన్నాడు. చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో కొట్టాలి.
కనీసం మంత్రిగా పని చేయని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే పాలన ఇలాగే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుదాం. 50 రోజుల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. ఆయన మూడు ఫీట్లు కూడా లేడు. మనల్ని 100 మీటర్ల లోతున బొంద పెడతడంట. ఈ ప్రగల్భాలు, పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి కంటే ముందు ఆయన గురువు మాట్లాడారు. ఏ నాటికి నువ్వు కేసీఆర్ కాలి గోటి కిందికి కూడా సరిపోవు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.